ధర్మపీఠం దద్దరిల్లింది: వందేమాతరం వందేమాతరం

Audio Song:
 
Movie Name
Dharma Peetam Daddarillindi
Song Singers
   S.P. Balu,
   P. Suseela
Music Director
   Chakravarthy?
Year Released
   1986
Actors
   Shobhan Babu,
   Sarada,
   Jaya Sudha
Director
   Dasari Narayana Rao
Producer
   K. Kesava Rao

Context

Song Context:
     ఆశయపథమున నడిచిన రాణా ప్రతాప్, వీరశివాజీ, భగత్ సింగ్, నేతాజీ
     మొదలగు నేతల ఉత్తేజముతో బ్రతకండి - వందేమాతరం !

Song Lyrics

||ప|| |అతడు|
       వందేమాతరం వందేమాతరం
కోరస్:
       వందేమాతరం వందేమాతరం
                        ||వందేమాతరం||
.
||చ|| అతడు:
       కారుచీకటిని చీల్చి వెలుతురును పంచే రవికిరణాలై
       జాతి పురోగతి గీతికలో వినిపించే రేపటి చరణాలై
       భావిజీవితపు ఆదర్శానికి గడచిన కాలము వెదకండి
       ఆశయపథమున నడిచిన నేతల ఉత్తేజముతో బ్రతకండి
                       ||వందేమాతరం||
.
||చ|| అతడు:
       భారత దేశము బానిసత్వమున కృంగిన ఆ సమయానా
       స్వాతంత్ర్య సంగ్రామ ప్రాంగణమ్ములో కొదమసింహమై రాణా
       చూపిన వీరప్రతాపం నీ ఆదర్శాలకు రూపం
       ఆ రాణాప్రతాప సింహం నీ జాతి జాగృతికి చిహ్నం
       నీ జాతి జాగృతికి చిహ్నం
                       ||వందేమాతరం||
.
||చ|| అతడు:
       దేశ భాస్కరుని దాస్యగ్రహణం పట్టిన తరుణములోనా
       కటికచీకటిని జాతిని కమ్మిన నైరాశ్యపు వేదనలోనా
       ఆ గ్రహణము పట్టిన వేళ ఆగ్రహమున పుట్టిన జ్వాల
       ప్రభవించేను వీరశివాజీ కాలాక్షుని తాండవలీల
       కాలాక్షుని తాండవలీల
                       ||వందేమాతరం||
.
||చ|| అతడు:
       పరజాతీయుల పరిహాసమ్మున పౌరుషాగ్ని ప్రజ్వలించగా
       జాతికేతనను బంధించిన ఆ శృంకలాలు తెగదెంచగా
       కార్చిచ్చులాగా దావాగ్నిలాగా ఆ భగత్ సింగ్ చెలరేగినాడు
       చిరునవ్వుతోడ నవయవ్వనాన్ని ఉరితాటి తోటి పెనవేసినాడు
       ఉరితాటి తోటి పెనవేసినాడు
                       ||వందేమాతరం||
.
||చ|| అతడు:
       ఉరకలు వేసే యువకుల నెత్తుటి కత్తుల కవాతు నడిపిన నేత
       అజాద్ హిందు ఫౌజ్ నిర్మాత నేతాజీ నీ స్ఫూర్తి దాత
       నీది ఆ వారసత్వం నీకున్నది వారిసత్వం
       నీ జీవిత సర్వస్వం జాతికి సగర్వమ్ముగా సమర్పితం
       సగర్వమ్ముగా సమర్పితం
                       ||వందేమాతరం||
.
||చ|| అతడు:
       సుకుమారమైన కుసుమాలవంటి జలతారు జీవితాలు
       కటువైన దేశసంరక్షణార్థమై రగిలించి చూపినారు
       కాలగతిలోన భౌతికమ్ముగా చితిజ్వాలలలో కలిశారు
       జాతి జ్యోతులై చిరంజీవులై ఇతిహాసముగా వెలిశారు
       ఇతిహాసముగా వెలిశారు
                        ||వందేమాతరం||
.
.
                  (Contributed by Dr. Jayasankar)

Highlights

Follow the complete lyrics!
…………………………………………………………………………………………………

7 Responses to “ధర్మపీఠం దద్దరిల్లింది: వందేమాతరం వందేమాతరం”

  1. achalla srinivasarao Says:

    దేశ భాస్కరుని దాస్యగ్రహణం పట్టిన తరుణములోనా
    కటికచీకటిని జాతిని కమ్మిన నైరాశ్యపు వేదనలోనా
    ఆ గ్రహణము పట్టిన వేళ ఆగ్రహమున పుట్టిన జ్వాల
    ప్రభవించేను వీరశివాజీ కాలాక్షుని తాండవలీల
    కాలాక్షుని తాండవలీల
    ఈ చరణం లో రెండవ వరుసలో కటిక చీకటిని ‘జాతి కుమిలే అనీ చివరిలో ‘కాలాక్షుని ‘ స్థానంలో ‘ఫాలాక్షుని ‘ అనీ వుండాలనుకుంటా . ఇలాంటి పాటలు విన్నప్పుడు దేహం కన్నా దైవం కన్నా దేశం మిన్నని భావిస్తాం పిడికెడు మట్టిని కాపాడేందుకు ప్రాణాలని మేం పణమిస్తాం అనిపిస్తుంది. మా ప్రాణం భారత దేశం మా ప్రణవం భారత దేశం అనిపించాలంటే శాస్త్రిగారి కలం ఇలా విజ్రుంభించాల్సిందే. జండా సినిమాలో పాటలు దొరికితే అప్ లోడ్ చేయండి . థాంక్స్

  2. admin Says:

    We have all the songs/lyrics of Sirivennela garu including “జండా”. But they need to be typed and so it takes time. Please let us know if you are interested in volunteering.

  3. achalla srinivasarao Says:

    sure its my pleasure

  4. నాగ శివ దుర్గా ప్రసాద్ Says:

    I don’t find enough words to thank you for presenting this song. Heartfelt blessings for the sincere work done. Unable to get the audio of this song any help is solicited. I am a teacher and I have been trying to find this song for children’s sake so far in vain.

  5. నాగ శివ దుర్గా ప్రసాద్ Says:

    Also a big fan of Sri Sirivennela Seetharama Saasthri.

  6. admin Says:

    Thank you Durga Prasad garu. I have replied by email to you just now.

  7. Srikanth Says:

    I can volunteer you in typing

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)