Search Results

చిన్నబ్బాయి: అంతా రండోయ్ రండి తందనాలకి సంతోషాలే తెండి

Audio Song:
 
Movie Name  
   Chinnabbayi
Song Singers
   Balu,
   Chitra,
   Chorus
Music Director
   Ilaya Raja
Year Released
   1997
Actors
   Venkatesh,
   Ramya Krishna
Director
   K. Viswanath
Producer
   M. Narasimha Rao

Context

Song Context: 
    గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళా
    కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
    శివ తాండవం చేయగా…

Song Lyrics

||ప|| |అతడు|
       అంతా రండోయ్ రండి తందనాలకి
       సంతోషాలే తెండి ముందు నాళ్లకి
                 || అంతా || |ఇద్దరు|
|ఆమె|
       గుండె లయలో గంగ అలలే చెంగుమను వేళా
       కొత్త శృతిలో అష్ట దిశలు గొంతు కలిపేలా
       తకిట తక తకిట తకిట తక తాళమే వేయగా.. శివ తాండవం చేయగా
|అతడు|
       తాళమే వేయగా.. శివ తాండవం చేయగా
                                  || అంతా || |ఇద్దరు|
.
||చ|| |అతడు|
       కవ్వించిన కాలం కలిసొచ్చిన వైనం
       కోలాటం వేస్తూ చేశే కోలాహలాన
|ఆమె|
       కేరింతల మేళం.. ఎలుగెత్తిన గానం
       ఊరంతా హోరెత్తించే ఈ రోజునా
|అతడు|
       కోదండ రామయ్య కళ్యాణమో
|ఆమె|
       గోపాల కృష్ణయ్య జన్మాష్టమో
|అతడు| అన్ని పండుగలలో        |ఖోరస్| కళలు కలిపి
|అతడు| వెయ్యి వేణువులలో       |ఖోరస్| స్వరములొలికి
|అతడు|
       సుందర స్వప్నము కన్నుల ముందర నిలిచి పిలిచెనిదిగో
                                  || అంతా || |ఆమె|
.
||చ|| |అతడు|
       ఎన్నో తిరనాళ్లు తిరిగొచ్చినవాళ్లు
       ఏనాడు చూసి ఉండరు ఈ సంబరాలు
|ఆమె|
       వెన్నెల కెరటాలు ఎగసే సంద్రాలు
       ఆ నింగీ నేలా కలిపే ఈ నవ్వులూ..
|అతడు|
       శ్రీవాణి కొలువైన ఈ కోవెల
|ఆమె|
       సింగారమయ్యింది ఇదిగో ఇలా
|అతడు| మదిని మేలుకొలిపే       |ఖోరస్| తెలుగు కొరకు
|అతడు| మనిషి మేలు తెలిపే       |ఖోరస్| తెలివి కొరకు
|ఆమె|
       చదువుల తల్లికి సేవలు చెయ్యగ తగిన తరుణమిదిగో
                                  ||అంతా||
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..