| 
 | 
 Context 
Song Context:  
  వలపా నీకు విరహంలోని చేదే మధురిమా?  | 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       ఇంతే అనుకోనా నాకు నీ ఋణం 
       జంటే విడిచేనా జన్మ బంధనం 
       మనసే నమ్మనీ ఇప్పుడైనా ఈ నిజం 
       మళ్లీ రానని వెళ్లిపోయే ఈ క్షణం 
       ఆపినా ఆగునా…   ఓ…ఓ…ఓ… 
                    ||ఇంతే అనుకోనా|| 
. 
చరణం: 
       పందెం వేసి పంతం పెంచు మాయా జూదమా 
       ప్రేమా నీది అడవుల్లోకి నడిపే పాదమా 
       అంతం చూసి సంతోషించు సరదా భావ్యమా 
       నీతో నువ్వు ఓడే ఆటలాడే ప్రణయమా 
       దాహం తీర్చని ఎండమావే నువ్వనీ 
       సత్యం తెలిసినా వెంట తరిమే ఆశనీ 
       ఆపినా ఆగునా…  ఓ…ఓ…ఓ… 
                     ||ఇంతే అనుకోనా|| 
. 
చరణం: 
       అద్దంలోనే ఆ చంద్రుణ్ణే చూపే మోసమా 
       అర్థం లేని ఆరాటాన్ని రేపే మోహమా 
       వలపా నీకు విరహంలోని చేదే మధురిమా 
       విడిపోతున్న హృదయంలోని బాధే సౌఖ్యమా 
       బదులే ఇవ్వని మంచు రూపం నువ్వనీ 
       అయినా వినమని విన్నవించే శ్వాసని 
       ఆపినా ఆగునా…ఓ…ఓ…ఓ… 
                      ||ఇంతే అనుకోనా|| 
. 
. 
            (Contributed by Nagarjuna)  | 
| 
 Highlights 
……………………………………………………………………………………………….. 
 | 
					
				 
				  No Comments »