|
Context
Song Context:
The eternal cycle of “(false) love”!
(ఆరు ఋతువుల్ని ఓసారే రప్పించి… తాను కూచుంది గుండెల్లో గూడెట్టి!) |
Song Lyrics
పల్లవి:
అనగా అనగా అనగా
అనగనగనగనగనగా
అంతే ఇంకేముంది చాలు కదా!
ఉందంటే ఉన్నట్టు, లేదంటే లేనట్టు
ఆకాశం లాంటిదే ప్రేమకథ
దీనికి ఆది అంతూ అంటూ ఉంటే కదా
.
చరణం 1:
వడగాలై కొడుతుంది..వడగళ్ళై పడుతుంది
చలిముల్లై కుడుతుంది వలపొచ్చి..
ఆరు ఋతువుల్ని ఓసారే రప్పించి
ఎన్నెన్నో వర్ణాలు వైనాలు తనలోనే ఉన్నట్టు
కన్నుల్ని ఆకట్టి
రమ్మంది పైనుంచి కూతెట్టి
తాను కూచుంది గుండెల్లో గూడెట్టి
.
చరణం 2:
మజునులెంతో మందికి
గజనీలెంతో మందికి
ఈ కథనే చెప్పింది జోకొట్టి
ఒళ్ళో పడుకోబెట్టుకున్న ఈ మట్టి
కునుకొచ్చిందే కాని ఊకొట్టి ఊకొట్టి
కడకేమైందో తెలియదు కాబట్టి… కాబట్టి!
మళ్ళీ వినిపిస్తుంది మొదలెట్టి
ఇంకో కొత్త జంటై మళ్ళీ మొలకెత్తి
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
అనగా అనగా అనగా ఓ “సిరివెన్నెల” sets off to tell us the cycle of “(false) love”…
pretends to put us into a lull as if that’s all there to it (అంతే ఇంకేముంది చాలు కదా!).
Before we realize, … starts hitting us with punchline after punchline within each line even before we can recover from the previous one,
… in his inimitable patented style… yet packed with with relentless humour 
There enters “yogi”… capturing all of it with his own captivating tune!
(With this combination, will we ever get into a lull?) ……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
December 21st, 2010 at 12:34 pm
Excellent songs!
December 21st, 2010 at 11:56 pm
No doubts….SPB is still the best.. Sirivennela is all time best…
శ్రీకారం చుడుతున్నట్లు..కమ్మని కలనాహ్వానిస్తూ.. నీ కనులెటు చుస్తున్నాయే.మాక్కూడా చూపించమ్మా..
ప్రాకారం కడుతున్నట్లు….. రాబోయే పండగ చుట్టూ.. నీ గుప్పిట ఏదో గుట్టు… దాకుందే బంగరు బొమ్మా…
నీ నడకలు నీవేనా .. చూసావా ఏనాడైనా.. నీ మెత్తటి అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో..
గమనించవు కాస్తయినా..నీ వెనకాలేమవుతున్నా.. నీ వీపుని ముళ్ళై గుచ్చే.. కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన వూరు..లావణ్యం పెట్టని పేరు..
లలనా.. తెలుసో.. లేదో… నీకైనా.. ఈ తీరు
నీ గాలే సోకిన వారు గాలిగ్గజలైపోతారు..
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణౌతారు
కవితవో ..యువతివో.. ఎవతివో.. గుర్తించేదెట్టాగమ్మా
నక్షిత్రాలెన్నంటూ..లెక్కెడితే ఏమయినట్లు..నీ మనసుకు రెక్కలు కట్టు.. చుక్కల్లో విహరించేట్లు..
ఎక్కడ నా వెలుగంటూ.. ఎప్పుడు ఎదురోస్తుందంటూ.. చిక్కటి చీకటినే చూస్తూ.. నిద్దురనే వెలి వేయొద్దు..
వేకువనే లాక్కోచేట్లు.. వెన్నెలనే దారం కట్టు.. ఇదిగో వచ్చానంటూ.. తక్షణమే హాజరయేట్టు
అందాకా మారాం మాని.. జోకోట్టవే ఆరాటాన్ని..
పొందిగ్గా పడుకో రాణి.. జాగారం ఎందుకు కాని..
నలినివో … హరిణివో .. తరుణీవో.. మురిపించే ముద్దుల గుమ్మ..
వీణౌతారు
ణౌ
January 2nd, 2011 at 1:22 pm
tamdrini mimchina tanayudo tagina tanayudo telcha galige samgita pariznanam naaku ledu kaani lyrics tunes oka danito okati poti padi manasuni ekkadiko tisuku vellaayi chaannalla tarvata all the best yogesvara sarma garu