మహేష్ ఖలేజా: పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువేనా

Audio Song:
 
Video Song:
 
Movie Name  
   Mahesh Khaleja
Song Singers
   Hema Chandra,
   Swetha
Music Director
   Mani Sharma
Year Released
   2010
Actors
   Mahesh Babu,
   Anushka
Director
   Trivikram Srinivas
Producer
   Singanmala Ramesh

Context

Song Context: 
   కాలం మేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా!
   లోకం గోకులంలా మారి పోయి మాయ జరిగిందా!
   ఊరంతా ఊగిందా నీ చెంతా చేరిందా గోవిందా!

Song Lyrics

||ప||
|ఖోరస్|
       मीठी मीठी धुन वो बजाए राधा के मन को लुभाए
       गोपी बोले गिरिधर नंदलाला नंदलाला
       मीटी मीटी धुन ओ बझाए राधा के मन को लुभाए
       गोपी बोले गिरिधर नंदलाला
       नंदलाला गोपी बोले गिरिधर नंदलाला
.
||ప|| |అతడు |
       పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువేనా ||2||
       నువ్వు చేరి నడి ఎడారి నందనమై విరిసిందా
       తనలో ఆనందలహరి సందడిగా ఎగసిందా
       నడిచిన ప్రతి దారి నదిగా మారి మురిసినదా ముకుందా
       కాలం మేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా
       లోకం గోకులంలా మారి పోయి మాయ జరిగిందా
|ఖోరస్|
       ఊరంతా ఊగిందా నీ చెంతా చేరిందా గోవిందా
.
||చ|| |ఆమె|
       ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా
       చిరు నవ్వోటి పూసింది నా వల్లనా
       అది నా వెంటే వస్తోంది ఎటు వెళ్ళినా
       మనసును ముంచేనా మురిపించేనా మధురమే ఈ లీల
ఆమె :
       నాలో ఇంత కాలం వున్న మౌనం ఆలపించిందా
       ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా
|ఖోరస్|
       ఊరంతా ఊగిందా నీ చెంతా చేరిందా గోవిందా
.
|ఖోరస్|
       झूमोरे झूमोरे झूमोरे ओ गिरिधर झूमोरे झूमोरे झूमोरे ओ गिरिधर
       झूमोरे झूमोरे झूमोरे ओ गिरिधर झूमोरे झूमोरे झूमोरे ओ गिरिधर
       झूमोरे झूमोरे झूमो गिरिधर झूमो झूमो झूमोरे झूमोरे झूमो झूमोरे झूमो
       झूमोरे झूमोरे झूमो गिरिधर झूमो झूमो झूमोरे झूमोरे झूमो झूमोरे झूमो
       आवो मुरली बजारे गिरिधर गोपाला बजाके मन को चुरारे गिरिधर नंदलाला
.
||చ|| |ఆమె|
       నా చూపే చెదిరిందా నీ వైపే తరిమిందా
       చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమువ్వ లా
       నన్ను నీ మాయ నడిపింది నలు వైపులా
అతడు :
       అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేళా
ఆమె :
       ఏదో ఇంద్రజాలం మంత్రమేసి నన్ను రమ్మందా
       ఎదలో వేణునాదం ఊయలూపి ఊహ రేపిందా
|ఖోరస్|
       ఊరంతా ఊగిందా నీ చెంతా చేరిందా గోవిందా
.
.
                              (Contributed by Vijaya Saradhi)

Highlights

   పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువేనా!
.
   తనలో ఆనందలహరి సందడిగా ఎగసిందా!
.
   కాలం మేను మరచి జ్ఞాపకాల్లో జారిపోయిందా!
(May be the time forgot its physical existence and lost itself in sweet memories?) Fascinating…
.
   ఈ భావం నాదేనా ఈనాడే తోచేనా!
.
   నాలో ఇంత కాలం వున్న మౌనం ఆలపించిందా!
   ఏకాంతాన ప్రాణం బృందగానం ఆలకించిందా!
.
   చిన్ని కృష్ణయ్య పాదాల సిరిమువ్వలా!
   నన్ను నీ మాయ నడిపింది నలు వైపులా!
   అలజడి పెంచేనా అలరించేనా లలనను ఈ వేళా!
.
These expressions/relations just keep flowing, apparently, from Sirivennela gari pen regardless of what year/age it is… as ever fresh and magical or logical, as it can get! Huh!
………………………………………………………………………………………………..

4 Responses to “మహేష్ ఖలేజా: పిలిచే పెదవుల పైనా నిలిచే మెరుపు నువేనా”

  1. Sri Harsha Says:

    కృష్ణ అంటే అందరినీ ఆకర్షించే వాడు అని అర్ధం. ఆయన కనిపిస్తే చాలు అందరు మంత్రముగ్ధులై ఉండిపొతారు. అలాగే కాలం కూడ మేను మరిచిపొయిందని ఎంత గొప్పగా కృష్నుడి అందాన్ని పొగిడారు? అద్భుతం అనే మాట చాల చిన్నది అని నిర్మొహమాటంగా చెప్పొచ్చు. ఇది అంత గొప్ప ఉదాహరణ ఎందుకంటే, కాలం ఎవ్వరికొసం ఆగదు. ఆ విషయం గురువు గారు కూడ చాలా పాటలలోనే చెప్పారు. ఐతే, అలాంటి కాలం కూడ ఆగిపోయేంత అందం కృష్నుడిదని చెప్పటం మహాద్భుతం.

    Hail Seeta Rama Sastry!

    Sri Harsha.

  2. bhavani Says:

    చాలా చక్కని పాట
    hindi lyrics లో
    मीठी मीठी धुन वो बजाए అని ఉండాలి (मीटी కాదు )
    అలాగే झूमोरे झूमोरे అని వచ్చిన చోట చివరి line లో చిన్న చిన్న mistakes ఉన్నాయి
    बजारे అని ఉండాలి (बझारे కాదు )
    बजाके (जाके కాదు )
    चुरारे (चुराले కాదు )
    గమనించగలరు
    आवो मुरली बजारे गिरिधर गोपला बजाके मन को चुरारे गिरिधर नंदलाला

  3. admin Says:

    Bhavani garu,
    Thanks a lot for the minute fixes.

  4. narasimha rao Says:

    god(the word is perfect for seetha rama sastry)

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)