|
Context
Song Context:
కయ్యానికి సయ్యందాం పదరా!
|
Song Lyrics
హేయ్! గణ గణ గణ గణ గుండెలలో జేగంటలు మ్రోగెను
రక్కసి మూకలు ముక్కలు ముక్కలయేలా
హేయ్! కణ కణ కణ కణ కన్నులలో కార్చిచ్చులు రేగెను
చిక్కటి చీకటి నెఱ్ఱగ రగిలించేలా
.
ఒరదాటిన నీ కత్తి ||ఖో|| పగవాడి పాలి మిత్తి
సహనం ఇక సరిపెట్టి ||ఖో|| గర్జించర ఎలుగెత్తి
ఎవ్వడురా ఎదటకి రారా
||ఖో|| అని అనగానే ఔరౌరా
నువ్వు ఆపదకే ఆపదవౌతవురా
.
||హీరో||
కీడంటే మన నీడే కదరా నదురా బెదురా ముందుకు పదరా
వేటంటే మన కాటే కదరా కయ్యానికి సయ్యందాం పదరా
||ఖో|| ||కీడంటే మన||
.
నువ్వు జెబ్బ చరిస్తే ||ఖో|| ఆ దెబ్బకి దయ్యం దడిసి
పెను బొబ్బక టేస్తే ||ఖో|| విని ఆకాశం అవిసి
జేజేలే జే కొడతారంతే
.
సింగం నువ్వై జూలిదిలిస్తే ||ఖో|| ఎంత మందైనా జింకల మందే
మీసం దువ్వే రోసం జూస్తే ||ఖో|| ఎముడికెదురుగా నిలబడి నట్టే
ఉసురుండదు ఉరకలు బెట్టందే
.
పిడుగల్లే నీ అడుగే పడితే పిడికెడు పిండే కొండ
నీపై దాడికి దిగితే మిడతల దండే దుండగులంతా
పర వాడిని పొలిమేరలు దాటేలా తరమకుండా
అలుపంటూ ఆగదుకదరా జరిగే యుద్ధకాండ
భారత జాతి భవితకి సాక్ష్యం ఇదిగోరా మన జెండా!
.
||ఖో|| ||కీడంటే మన||
|
|
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)