కుదిరితే కప్పు కాఫీ: అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా?

 

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kudirithey Kappu Coffee
Song Singers
   Chitra
Music Director
   Yogeswara Sharma
Year Released
   2011
Actors
   Varun Sandesh,
   Suma Bhattacharya
Director
   Ramana Salva
Producer
   Mahi
   Shiva

Context

Song Context:
   (నా మనసుని)నిందించాలా? (నేను)ఆనందించాలా?
    నిన్నడగాలనుకుంటున్నా!!!
    అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా!

Song Lyrics

పల్లవి:
       అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా
       తొందర పెట్టే తోవల వెంటే వెళ్ళిపోవాలా
       అనుకోనిదైనా ఆలోచన
       బాగుంది అననా ఈ భావన
       నిన్నడగాలనుకుంటున్నా
       నిందించాలా ఆనందించాలా
.
చరణం 1:
       నో నో అటు పోవద్దు మనసా ఏంటా మత్తు
       అన్నా ముందే ఎన్నో చెప్పి
       ఏదో సరదా లెద్దూ వేరే ఏమీ లేదు
       తప్పా అంది కట్టు తప్పి
       వీలైతే కాసిని కబుర్లు కుదిరితే కప్పు కాఫీ
       అంటూనే చేజారింది ఇట్టే కన్ను కప్పి
       మాట మాట కలిపి అటు పైన మాయగొలపి
       ఎంత హాయి అందే ఈ తీయనైన నొప్పి
       నిన్నడగాలనుకుంటున్నా
       నిందించాలా ఆనందించాలా
.
చరణం 2:
       తానే నమ్మేటట్టు తనపై తానే ఒట్టు
       వేస్తూ అందించింది హామీ
       పోన్లే పాపం అంటూ త్వరగా వచ్చెయ్యంటూ
       చూస్తూ పంపించాను మదిని
       గూడంతా ఖాళీ చేస్తూ వెళిపోయిన గువ్వల్లా
       నా కన్నుల్లో కలలన్నీ నీ వల్లో చిక్కాలా
       ఎవరి నేరమంటూ నిష్టూరమెందుకంటే
       కలిసి ఒప్పుకుంటే అది కూడా మంచిమాటే
       నిన్నడగాలనుకుంటున్నా
       నిందించాలా ఆనందించాలా
.
.
      (Contributed by Vijaya Saradhi)

Highlights

Looks like already became the most popular song!
………………………………………………………………………………………………..

2 Responses to “కుదిరితే కప్పు కాఫీ: అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా?”

  1. bhavani Says:

    I think there is some copy paste mistake
    గూడంతా ఖాళీ చేస్తూ వెళిపోయిన గువ్వల్లా
    నా కన్నుల్లో కలలన్నీ నీ వల్లో చిక్కాలా ani undali

  2. admin Says:

    Bhavani garu,
    Thank you very much. Fixed it now.

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)