|
Context
Song Context:
అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా!
నే నవ్వితే చిరు చేదుగా ఉందేమో పాపం తనకి!
అమ్మాయిగ జన్మించడమేనా నే చేసిన అపచారం!
(Teasing song by her in self-debate form!) |
Song Lyrics
పల్లవి:
అతడిలో ఏదో మతలబు ఉందే…ఏంటంటే చెప్పడుగా
అతివను చూస్తే ఆమడ దూరం పోతాడే వడివడిగా
ప్రాణహాని మానహాని వెంటపడి వస్తున్నట్టే
పొగరనాలో బెదురనాలో వాలకం చూస్తుంటే
||అతడిలో||
.
చరణం 1:
విరక్తి చెందే వయస్సు కాదే పైలా పచ్చీసే
తపస్సు చేసే తలంపు లేదే హుషారైన ఫేసే
ఏతావాతా తేలేదేమిటి ఎలాంటి తేడా లేదే
ప్రేమా భామా అనేది మాత్రం చెవిలో పడరాదంతే
ఎన్నాళ్ళిలా ఏకాకిలా ఉంటాడో ఏమో తెలీదే
||అతడిలో||
.
చరణం 2:
తనేమి అనడు అనేది వినడు ఏం మనిషో గాని
అదో విధంగా అమాయకంగా చూస్తాడెందుకని
అమ్మాయిగ జన్మించడమేనా నే చేసిన అపచారం
మగపుట్టుక మడి చెడిపోతుందా నాతో చేస్తే స్నేహం
నే నవ్వితే చిరు చేదుగా ఉందేమో పాపం తనకి
||అతడిలో||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Yet another hilarious one from the legendary dad & the melodious number from the debutant son!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)