|
Context
Song Context:
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయో, మాక్కూడా చూపించమ్మా
.
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరు బొమ్మా! |
Song Lyrics
పల్లవి:
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయో మాక్కూడా చూపించమ్మా
.
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ గుప్పిట ఏదో గుట్టు దాక్కుందే బంగరు బొమ్మా
||శ్రీకారం||
.
“జల జల జల జాజుల వాన కిలకిలకిల కిన్నెర వీణ
మిలమిలమిన్నంచుల పైన మేలి తిరిగిన చంచలయాన
మధురోహల లాహిరిలోన మదినూపే మదిరవె జాణా!”
.
చరణం 1:
నీ నడకలు నీవైనా చూశావా ఏనాడైనా
నీ మెత్తని అడుగుల కింద పడి నలిగిన ప్రాణాలెన్నో
గమనించవు కాస్తైనా నీ వెనకాలేమౌతున్నా
నీ వీపుని ముళ్ళై గుచ్చే కునుకెరుగని చూపులు ఎన్నో
లాస్యం పుట్టిన ఊరు లావణ్యం పెట్టని పేరు
లలనా తెలుసో లేదో నీకైనా నీ తీరు
నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలైపోతారు
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణౌతారు
కవితవో యువతివో ఎవతివో గుర్తించేదెట్టగమ్మా
.
చరణం 2:
నక్షత్రాలెన్నంటూ లెక్కెడితే ఏమైనట్టు
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు
ఎక్కడ నావెలుగంటూ ఎప్పుడు ఎదురొస్తుందంటూ
చిక్కటి చీకటినే చూస్తూ నిద్దురనే వెలి వేయొద్దు
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు
ఇదిగో వచ్చానంటూ తక్షణమే హాజరయేట్టూ
అందాకా మారాం మాని జోకొట్టవే ఆరాటాన్ని
పొందిగ్గా పడుకో రాణీ జాగారం ఎందుగ్గానీ..
నళినివో హరిణివో తరుణివో మురిపించే ముద్దులగుమ్మా
.
.
(Contributed by Vijaya Saradhi & Nagarjuna) |
Highlights
Debut song for the debut music director Yogeswara Sharma, son of our Sirivennela garu!
.
ఓ చిలిపి idea:
శ్రీకారం చుడుతున్నట్టు కమ్మని కలనాహ్వానిస్తూ
నీ కనులెటు చూస్తున్నాయో, ఓ యోగి! మాక్కూడా చూపించయ్యా!
.
ప్రాకారం కడుతున్నట్టు రాబోయే పండగ చుట్టూ
నీ మది తలపుల గుట్టు, ఓ యోగి! మాక్కూడా వినిపించయ్యా!
.
నీ మనసుకు రెక్కలు కట్టు చుక్కల్లో విహరించేట్టు!
వేకువనే లాక్కొచ్చేట్టు వెన్నెలతో దారం కట్టు!
.
Folks, fasten your seat belts & Get ready for the take off with this dad - son జుగల్ బంధి!!!
……………………………………………………………………………………………….. |
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)
January 2nd, 2011 at 12:54 pm
నీ గాలే సోకిన వారు గాలిబ్ గజలైపోతారు
నీ వేలే తాకిన వారు నిలువెల్లా వీణౌతారు
emtaTi madhurOha idi excellent feeling
January 11th, 2011 at 11:02 pm
సందేహిస్తూ ఉంటే . అతిగా.. సంకల్పం నెరవేరదుగా..
ఆలోచన కన్నా… త్వరగా.. అడుగేద్దాం ఆరంభంగా..
………..
మొదలెట్టక ముందే ముగిసే.. కథ కాదే ఈ పయనం..
సమరానికి సై అనగలిగే .. సంసిద్దత పేరే విజయం..
June 29th, 2011 at 5:15 pm
sirivennela gaaru “meeru manishaa manushulalo rushaa leka telugu cine parisramane roju koraku velli virisina usha me valla marenu disha” hatsoff 2 u sir..