కుదిరితే కప్పు కాఫీ: ఈ లోకం ఏం చూస్తోందో, చూస్తున్నా ఏం చేస్తోందో

Posted by admin on 7th January 2011 in The mystery of Love!
Audio Song:
 
Video Song:
 
Movie Name
   Kudirithey Kappu Coffee
Song Singers
   Ranjith,
   Balaji
Music Director
   Yogeswara Sharma
Year Released
   2011
Actors
   Varun Sandesh,
   Suma Bhattacharya
Director
   Ramana Salva
Producer
   Mahi
   Shiva

Context

Song Context:
   The mystery of Love!
   (ఈ లోకం ఇదే ప్రేమా, అంటుందో… అనుకుంటుందో!)

Song Lyrics

పల్లవి:
       ఏదో.. ఏదో… ఏదో.. ఏదో…
       ఏదో.. ఏదో… ఏదో.. ఏదో…
       ఈ లోకం ఏం చూస్తోందో
       చూస్తున్నా ఏం చేస్తోందో
       ప్రశ్నిస్తే బదులేదైనా వుందో లేదో
       ప్రాణాలే పందెం వేస్తూ
       ప్రాయాన్నే ఆటాడించే
       ప్రేమంటే అర్థం తెలిసిందో లేదో
                           ||ఏదో||
.
చరణం 1:
       గాలి వాటమే గమనమని పరిగెడితే
       కాలకూటమే అమృతమని పొరబడితే
       సంద్రంలో చేరే మోహం కాదా గంగా ప్రవాహం
       కన్నీరే కోరే దాహం కాదా నిండు జీవితం
       ఉరెక్కి ఉయ్యాలూగే ఉన్మాదం పేరు ప్రేమా
       నిప్పుల్లో నిత్యం వేగే నిట్టూర్పేరే ప్రేమా అంటుందో… అనుకుంటుందో!
                            ||ఈ లోకం||
.
చరణం 2:
       త్రోవ తోచదే భ్రమ పడే తలపులకు
       దారి చూపదే బ్రతుకు కే చితి వెలుగు
       వందేళ్ళ బంధాలన్నీ తెంచే భావం ఏమిటో
       గుండెల్లో శ్వాసే కొండంతయ్యే భారం ఏమిటో
       ఏం పొందాలనుకుంటుందో అది ఏ శూన్యంలో వుందో
       బలి కోరే ఆరాటంతో మది అన్వేషిస్తూ ఏమై పోతుందో… ఎటు పోతుందో!
                            ||ఈ లోకం||
                             ||ఏదో||
.
.
              (Contributed by Vijaya Saradhi)

Highlights

Unbelievable composition purely highlighting the lyrics (making one wonder if it was lyrics first and tune next, even though it was the other way round), yet so mesmerizingly reflecting the mystery of love, with crafty pauses & lyrical accentuations !!!
Way to go Yogi!

………………………………………………………………………………………………..

4 Responses to “కుదిరితే కప్పు కాఫీ: ఈ లోకం ఏం చూస్తోందో, చూస్తున్నా ఏం చేస్తోందో”

  1. Mrudula J Says:

    “ఉరెక్కి ఉయ్యాలూగే ఉన్మాదం పేరు ప్రేమా
    నిప్పుల్లో నిత్యం వేగే నిట్టూర్పేరే ప్రేమా”
    – ఎంత intense గా ఉన్నాయ్ ఆ మాటలు. వినగానే goosebumps వచ్చేసాయి నాకు.
    “త్రోవ తోచదే భ్రమ పడే తలపులకు
    దారి చూపదే బ్రతుకు కే చితి వెలుగు”
    – Problems కి solution “death” కాదు అని నాలుగు మాటల్లో చెప్పేసారు.

    సిరివెన్నెల గారు, మీ పాటల గొప్పతనాన్ని కరెక్ట్ గా వర్ణించడానికి మీరే మాటలు పేర్చాలేమో. మిగతా వాళ్ళు కేవలం వినగలరు అంతే.
    ధన్యులం సర్.

  2. rathnamsjcc Says:

    ఓo
    శ్రీ సద్గురవే నమః
    అచల పరిపూర్ణ రాజయోగ సిద్ధాం .ఆత్మ లోఎరుక చైతన్యం .లేని స్ధానంలేదు

    ఈ మనస్సు ఎక్కడ నుంచి వచ్చింది అక్క డై మనస్సునిలిచి , నీ నిజస్వరూ పం బట్టబయలుగ అనుభూతి.కాగలదు. సూక్ష్మ చైతన్య..కంటికి కనిపించదు.అనుభవపూర్వకంగ గ్రహించాల్సిం చూడ చూడ కలుగును సూక్ష్మ చైతన్య.సాధన ద్వారా తెలుస్తుంది సూక్ష్మచైతన్యం ఎందెందు వెతికినా అందందే గలదు ఎలా బ్రహ్మం భావన సూక్ష్మతత్వం క్షణాన్ని ఎవరూ ఆలోచించలేదు -కొంతసమయాన్ని క్షణముగా గుర్తించినను మరో క్షణములుగా ముందుకు వెళ్లుతున్నారే గాని క్షణము తెలియక గడిచిన గత కాలమెంతో నేటికి తెలియుటలేదు సూక్ష్మదృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు సూక్ష్మతత్త్వము కాబట్టి. కాళిదాసు ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు మనస్సు ” మూలం. కనుక మానవుడు ముందుగా ఆత్మ “జ్ఞానం” సంపాదించాలి..ఆత్మసత్యమైన జ్ఞానము ఆత్మ జ్ఞానమే అంటే తనను తాను తెలుసుకోవడమే, తనలోని అంతరాత్మను గురించి … సూక్ష్మచైతన్యం.సాధనల యొక్క అత్యున్నత లక్ష్యం ఈ .సమాధి..

    మనస్సునిలిపి సాధన ఆలోచనలు నెమ్మది,నెమ్మదిగా కట్టడిచేయబడి, చివరకుమనస్సులోఆలోచనలు కలుగనిస్థితిఏర్పడుతుంది.సమాధిస్థితి
    మనస్సునిలిపి నిశ్చల స్థితికి చేరుకుంటాయి ఈ .సమాధి.. ఈ విషయం మన మనస్సులో క్షణకాలం తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే, ‘తెలిసే స్థితి’ నుంచి ‘ఏమీ తెలియని స్థితి’ – లేదా సమాధిస్థితి” కి చేరే సమయం. ఒకసారి సూక్ష్మచైతన్యం క్షణముస్థితిలోకి వెళ్తే, ఎంతసేపో చెప్పలేంకాబట్టి, క్షణకాలం మనం సమాధిస్థితిలో వుంటాం. ఆ సమాధిస్థితినుంచి బయటకు వచ్చినప్పుడు, జాగృతావస్థలో, మన మనసుకు ఏదో తెలియని ఆనందం పొందినట్లుగా తెలుస్తుంది బ్రహ్మంసూక్ష్మచైతన్యం క్షణముపోందుతాము.
    నిద్రలో మనస్సులేదు దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలోమనస్సు నీవు సూక్ష్మనిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. రూపమున్నపుడే నామము ఏర్పడును. పూర్ణత్వమును పరిచ్చిన్నము చేస్తేనేగాని రూపం ఏర్పడదు. నామ రూపములు కేవలం వ్యవహారికం మాత్రమే. జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర కాదు. నేను అనగా ఆత్మ నేనే సర్వాత్మనుండి ఉద్భవించి

  3. rathnamsjcc Says:

    సమస్తమునందు తనను తాను దర్శించును. నీయందు నేను,నాయందు నేనే ఒకడే కనుక “అవును నేనే”
    శిష్యుడు: గురువుగారూ.. మీరు దేవుని చూశారా?
    గురువు: చూశాను, చూస్తున్నాను.
    శిష్యుడు: ఎక్కడ?
    గురువు: ఇక్కడే, నా ఎదురుగానే ఉన్నాడు.
    శిష్యుడు: నేనా?
    గురువు: అవును నేనే.
    శిష్యుడు: నేను నేనా…. అంటే మీరు అవును నేనే అంటున్నారు. నాకు అర్థము కాలేదు కొంచెము వివరించండి గురువుగారూ..
    గురువు: అవును నీలో, నాలో ఉన్న నేనే అసలైన దైవము. అతడు సర్వాంతర్యామి. సమస్త భూతములలో,జీవులలో నేనై అంతర్యామిగా వెలుగుతున్నాడు. మనము ఏ కక్ష్యలో నుండి మాట్లాడుతున్నామో ఆ ప్రతిఒక్కటి కూడా నేను గానే వ్యవహరింపబడుతుంది. శరీరము గురించి చెపుతున్నప్పుడు, నేను అంటాము. మనస్సు గురించి చెపుతున్నప్పుడు, నేను అంటాము. ధర్మాధర్మ విచక్షణ చేస్తున్నప్పుడు నేను అంటాము. ఇలా అనేక సారు నేను, నేను అని చెపుతాము. కానీ ఇన్ని నేనులుగా ఉన్నవాడికి మూలమైన ఒక నేను ఉన్నది. అది ప్రతి ఒక్క జీవునిలోనూ అంతర్యామిత్వము చెంది ఉంటుంది. అది అన్నిటికి మూలమైన తత్వము. నీలో, నాలో అందరిలో జీవించి ఉండుటకు మూలమైన తత్వము. అది అసలైన నేను
    శిష్యుడు: కొంచెము వివరించండి గురువుగారు…
    గురువు: ఎవరైనా “నేను” అని ఎలా అనగలుగుతున్నారు? దేని వల్ల అనగలుగుతున్నారు? జీవుడు చైతన్య స్వరూపుడు, ప్రజ్ఞా స్వరూపుడు కనుక అనగలుగుతున్నాడు. చైతన్యానికి మూలము ఏది? అది పరతత్వము. ఆ తత్వము ప్రకృతికి అతీతమై వెలుగును. ఆ తత్వము ప్రకృతిచే చేయబడిన విభాగముల (పురములు) యందు దిగివచ్చును కనుక అతనిని పురుషుడు అంటారు. అతడే పరమ పురుషుడు లేక ప్రధాన పురుష నాయకుడు. ప్రకృతి,పురుషుడు అను భేధము మాయ వలన పుట్టును. మాయ అతని నుండి క్రీడ కొరకై పుట్టును. ప్రకృతి నుండియే సృష్టి విభాగములన్నియు పుట్టును. ఈ విభాగమునకు మూలమైన మొదటి ప్రకృతిని ప్రధానమందురు. అదే మూల ప్రకృతి. దాని యందు పురుషుడు జీవుడై దిగి వర్తించును. అతడు విడదీయ వీలుకాని వాడు. అతని యందు విభాగములు ఉండవు. తనకు తానే వెలుగు కనుక అతడు వెలిగింప బడడు. అతడు సూక్ష్మ స్వరూపుడు. వానికి ఇతర వస్తువులుండవు. కనుక రెండు వస్తువుల నడుమ ఉన్న భేధముచే విడదీయబడడు. అతడు వస్తువుల మంచి చెడ్డలతో సంబంధము లేని వాడు. వ్యక్తుల మంచి చెడ్డలతో సంబంధము లేనివాడు. కలుగుచున్న భావములు, జరుగుచున్న సృష్ట్యాది కర్మలు వానికి పట్టవు. ఈ ప్రపంచము అంతా వాని మయము. అట్టివానిని భాగవతమున నారాయణుడు అంటారు. నారములు అనగా జీవ జలములు. వాని యందు జీవులకు ఆరోహణ, అవరోహణలను (జనన,మరణములు) కలిగించు తత్వము కనుక దానిని నారాయణుడు అంటారు. ప్రకృతి, పురుషుడు రెండునూ నారాయణుని యందు వర్తించును కనుక నారాయణుడు ప్రధానమునకు, పురుషునకు నాయకుడు. వానిని ఆశ్రయించిన మనస్సు కలవాడుగా నుండును కనుక ప్రకృతి పురుషులకు అతీతుడుగా ఉండును. వాని పేరు “నేను”. అట్టి నేనే భగవంతుడు. అతడే దైవము. కనుక నీలో, నాలో అందరిలో నేనై వెలుగొందుతున్న వాడే దైవము. సమస్తమునకు అతడే మూలము.
    అన్నిటి యందు అతడున్నాడు కనుక మనస్సున కందినంతవరుకు వానిని కల్పించుకొని వాని యందు భక్తిని ప్రయోగించి, ఆ పరమ పురుషుని దర్శించి అతనిగా జీవించుటను పరతత్వము సిద్దించుట అంటారు. అట్లు సిద్దించిన వారు భాగవతోత్తములు. వారికి మోక్షము నందు ఆసక్తి ఉండదు. సమస్త సిద్ధులు వారిని ఆశ్రయించి ఉండును. నిరంతరమైన ఆనందము వారికి సమకూరును. వారికి మోక్షము నందే ఆసక్తి లేనందున లెక్కలకు, కొలతకకు అందనిదగు స్థితి వారి వశమై ఉండును. సర్వ శుభలక్షణములు ఆ స్థితియందు ఇమిడి ఉండును కనుక మోక్ష స్థితిని వారు అప్రయత్నముగా పొందుతున్నారు. వారిని కాల చక్రము మింగదు. వారు నిత్యులై సాటిలేని సుఖానుభవమున నుందురు. అట్టి స్థితి మోక్ష స్థితి. మోక్షమనగా కోరిక వల్ల కలిగేది కాదు, కోరికలు లేక నిరంతరము తనయందు తాను రమిస్తూ నేనైన నేనుగా జీవించు స్థితి. అట్టి వాడు సమస్తమునందు తనను తాను దర్శించును. నీయందు నేను,నాయందు నేను ఒకడే కనుక “అవును నేనే” అన్నాను అని గురువు తను చెప్పినది శిష్యునికి అవగతము అగుటకు మౌనమును ప్రసాదించెను

    ఆత్మస్థితి యందలి పొరలు. క్రింది నాలుగు భౌతిక స్థితియందలి పొరలు. అంతటా నిండి ఉన్న చైతన్యముఎప్పుడూ ఒకే స్థితియందు ఉంటుంది. అది తనకు తానుగా ఉండే స్థితి. కానీ దానిని ఆథారము చేసుకొని వేరుగాఉన్న ప్రకృతిద్వారా పుట్టిన జీవరాశులు, వేరుబడిన స్థితిలో ఉండుట చేత ప్రత్యగాత్మలై తాము వేరుగా ఉన్నట్లుగాభావిస్తాయి. అలా భావించటమునే అహంకారము అని అంటారు. అహంకారము అంటే తాను ఉన్నట్లు భావించుట.నిజమునకు తాను వేరుగా లేడు. ఉన్నది విశ్వాత్మకమైన ఆత్మచైతన్యమే తానుగా ఉన్నది. ప్రకృతి గుణముల ద్వారాదిగివచ్చిన చైతన్యము మేల్కాంచి గుణముల సాంగత్యము వలన అహంకార పురుషుడుగా ప్రవర్తిస్తాడు. అప్పుడుఅతని అస్థిత్వానికి ఆథారమైన పరమ పురుషుడు అతని యందు సాక్షీభూతుడుగా ఉంటాడు. ఇద్దరూ కూడా”నేను” అనే పిలువబడుతున్నారు. స్థితులు వేరు. ఒకడు చస్తూ పుడుతున్నాడు, ఇంకొకడు చావు పుట్టుకలకుఅతీతుడై ఉన్నాడు. ఎవరైతే బుద్దిమయ లోకాన్ని దాటి ఆత్మ స్థితియందు స్థిరపడతాడో వానికి జన్మలు ఉండవు.అంటే వాడు వాడిగానే ఉంటాడు, శరీరములు వచ్చిపోతూ ఉంటాయి. ఎలా తాను శరీరాన్ని ధరిస్తున్నాడో,త్యజిస్తున్నాడో తెలిసి ఉంటాడు. పరమపురుష స్థితికి చేరిన వాడు పరమాత్మ యందు లీనమైనవాడు. అనగామోక్షస్థితిని పొందినవాడు

    నేను, నాది. ఇక్కడ ఇద్దరు వున్నారు. ఒకరు నేను, ఇంకొకరు నేను కన్నా వేరుగా వున్నవాడు. ఈ నేనుఅన్నవాడు అందరిలో అంతటా వున్నవాడు. అంతటా వ్యాపించి వున్నవాడిని అంతర్యామి అంటారు.వ్యాపించివున్నవాడిని సంస్కృతములో “విష్ణువు” అంటారు. “విష్ణుః” అన్నదానికి వ్యాపించుట అని అర్థము. అతడేపరమపురుషుడు. సర్వాంతర్యామి. జీవుడు ఆచరిస్తున్న సమస్త కర్మలు అంటకుండా అతీతుడై తనకు తానుగాఉన్నవాడు. ప్రకృతియందలి ప్రతి అణువునందు ఉన్నాడు. సమస్తము అణువుల సమాహారమే. ఎన్ని నగలుఉన్ననూ అందున్నది బంగారమే కదా! ఒక్కొక్క నగకు ఒక్కొక్క పేరు, అకారము ఎలావున్నాయో అలాగే ఒకేఒకచైతన్యము ఇన్నిరకములుగా వర్తిస్తున్నది.

    ఇతరులను చూసినప్పుడు గుణముల ద్వారా ప్రవర్తిస్తున్న వాడిని చూడకుండా ఎవని ఆథారముగా వాడు ఉన్నాడోవానిని దర్శించినచో సర్వాంతర్యామి సాథన కొనసాగును. శబ్ద, స్పర్శ, రూప, రస గంథాలకు ఆథారమైన వానినిగ్రహించాలి. జ్ఞానేంద్రియముల ద్వారా ప్రపంచమును గమనిస్తున్న వానిని దర్శించుటకు ప్రయత్నము చేయవలెను.చూస్తున్న వానిలో చూసేవాడు ఎవరు? ఎలా చూడగలుగుతున్నాడు? అసలు చూడటము అంటే ఏమిటి? అన్నప్రశ్నలు కలిగి అన్నికి ఆథారమైన శుద్ద చైతన్యాన్ని దర్శించగలగాలి. మొదట తనయందు దర్శించి తరువాతవానిని అందరియందూ దర్శించి సాథన చేయవలెను. ఒకేఒక చైతన్యము అనేకవిథములుగా ప్రవర్తిస్తున్నదనిగ్రహించవలెను. ఆవిథముగా దర్శించినవానికి సృష్టిలో దైవము ఏవిథముగా ఉన్నాడో తెలుస్తుంది.

  4. rathnamsjcc Says:

    మనస్సును జయిస్తేనే శాంతి

    మనస్సును స్థిరీకరింపజేసి, ఆలోచనలను నెమ్మదిగా కట్టడి చేసినప్పుడు మనస్సులో ఆలోచనలు అసలు కలుగని స్థితి ఏర్పడుతుంది. మనస్సు నిశ్చల స్థితికి చేరుకుంటుంది. ఇది సమాధి. ఈ విషయం మన మనస్సులో క్షణకాలంపాటు తెలుస్తుంది. ఇది సంధి స్థితి. అంటే తెలిసే స్థితినుంచి ఏమీ తెలియని స్థితికి చేరుకోవడం. ఆ సమాధి స్థితి నుంచి బైటికి వచ్చినప్పుడు మన మనస్సుకు తెలియని ఆనందం పొందినట్లు తెలుస్తుంది. మనం సమాధి స్థితిలో ఉన్న క్షణకాలం బ్రహ్మ సూక్ష్మ చైతన్యాన్ని పొందుతాము.
    మనం నిద్రిస్తున్నప్పుడు దేహ స్మృతి ఉండదు. ఆ స్థితిలో మనస్సు ఉండదు. నిరాకార చైతన్యమై ఉంటాము. తమను తాము నిరాకారంగా భావించలేని వారు నిరాకారమైన దైవాన్ని ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామ రూపాలు లేనట్లే, సర్వత్రా అంతర్లీనంగా ఉన్న సర్వేశ్వరునికి నామ రూపాలు లేవని తెలుసుకోవాలి.
    శరీరమూ, ప్రపంచమూ, - అన్నీ సర్వాత్మనుండి ఉద్భవించే అందే లయమవుతున్నాయి. ‘నేను’ అంటే భౌతిక శరీరం కాదు. నేను అంటే ఆత్మ. అంతటా వ్యాపించి ఉంటుంది ఆత్మ. కనుక దీనిని బ్రహ్మం అనే అర్థంలో వాడు తారు. ఆత్మనుంచి కలిగే బుద్ధిని అటూ ఇటూ పోనివ్వక, అన్నిటికీ మూలమైన మనస్సును దేవుడి మీదికి మళ్లించె వాడు ఉత్తముడవుతాడు. అలా దేవుడిపట్ల ఏకాగ్రత లేనట్ల యితే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి లభించదు. మనస్సును జయించినవాడు శాంతిని పొంది ఉంటాడు. కనుక పర మాత్మను చేరినవాడవుతాడు.
    ఇటువంటి వ్యక్తికి సుఖ దు:ఖాలు, శీతోష్ణాలు, మానావ మానాలు అన్నీ సమానమే. అలాగే రాయి అయినా, బంగారమైన అతడికి సమానమే. తాను పొందిన జ్ఞాన విజ్ఞా నాలతో సంపూర్తిగా సంతృప్తి చెంది, ఆత్మానుభవ స్థితిని పొంది యోగిగా గుర్తించబడతాడు

    శ్రీ రత్తయ్య గారి
    బెంగళూరు

Leave a Reply

To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)