|  | Context Song Context:గౌతమీ సుత శాతకర్ణి! బహు పరాక్! బహు పరాక్!
 
 | 
| Song Lyrics ||అతడు||సాహో! సార్వభౌమా! సాహో!   ||3||
 సాహో! సార్వభౌమా!
 .
 కాలవాహిని శాలివాహన శకముగా
 ఘనకీర్తి పొందిన సుప్రభాత సుజాతవహ్నీ!
 గౌతమీ సుత శాతకర్ణి!
 బహు పరాక్! బహు పరాక్!  ||2||
 .
 కక్షల కాళ రాతిరిలోన కాంతిగ
 రాజసూయాధ్వరమునే! జరిపెరా!…
 కత్తులలోన ఛిద్రమ్మైన  శాంతికి తానె
 వేదస్వరముగా! పలికెరా!
 సాహో! సార్వభౌమా! బహు పరాక్!
 .
 నిన్నే కన్న పున్నెం కన్న ఏదీ మిన్న కాదనుకున్న
 జననికి జన్మ భూమికి తగిన తనయుడివన్న
 మన్నన పొందరా! .. ||2||
 .
 స్వర్గాన్నే సాధించే విజేత నువే
 సాహో! సార్వభౌమా! సాహో!
 స్వప్నాన్నే సృష్టించే విధాత నువే
 సాహో! సార్వభౌమా!
 .
 అమృతమంథన సమయమందున
 ప్రజ్వలించిన ప్రళయ భీకర
 గరళమును గళమందు నిలిపిన హరుడురా!
 శుభకరుడురా!
 బహు పరాక్!   బహు పరాక్! ||2||
 .
 పరపాలకుల పదపంకముతో కలుషమ్మైన
 ఇలనిను పిలిచెరా! పలకరా!
 దావానలము వోలే దాడి చేసిన దుండగీడుల
 దునుమరా! దొరా!
 సాహో! సార్వభౌమా! బహు పరాక్! ..
 .
 దారుణమైన ధర్మగ్లాని ధారుణివైన కాలూనింది
 తక్షణమొచ్చి రక్షణనిచ్చి దీక్షగ అవతరించర
 దేవరా! .  (2)
 దేవరా…….
 |  | 
| Highlights ………………………………………………………………………………………………..
 | 
					
				 
				  
		
	
	
	
 
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below) 
 
	
	
August 16th, 2017 at 5:08 am
I have collected around 400 songs of Sastry garu. If you are interested please send a mail to sirivennelasongs@gmail.com, I can share them with you.
February 15th, 2018 at 4:13 pm
Thanks you Ravindra garu.
Just now I sent an email to you.