|
Context
Song Context:
నా నరనరమున ఈ వెచ్చదనం నా పౌరుషమా! నీ పరిమళమా!
|
Song Lyrics
||అతడు||
అధరమదోలా అదిరినదేలా? ||2||
కనుకొలకుల ఆ తడి తళుకేలా?
మృగనయనా! భయమేలనే ||2||
.
||ఆమె||
తెగ బిడియాలా తెర కరిగేలా ||2||
తొలి రసలీలా తొణికిన వేళా?
తెలిపెదనా ప్రియకామనా! ||2||
.
||చ||
||ఆమె||
కాముని గెలిచే కదనము చేయగా సైన్యము లేలా మనజత చాలుగా
.
||అతడు||
నీ సోయగాల సామ్రజ్యం నా సొంతమైన ఏకాంతం
దివినే ఇలపై నిలిపింది చూడు లలనా!
మృగనయనా భయమేలనే ||4||
.
||చ||
||అతడు||
నా నరనరమున ఈ వెచ్చదనం నా పౌరుషమా! నీ పరిమళమా!
.
||ఆమె||
నీ శ్వాసలోన సంకల్పం నీ శాసనాల ప్రతి స్వప్నం
నేనే అవనా నీ అడుగు అడుగులోనా
తెలిపెదనా ప్రియకామనా! ||2||
.
||అతడు||
అధరమదోలా అదిరినదేలా? ||2||
కనుకొలకుల ఆ తడితళుకేలా?
మృగనయనా భయమేలనే? ||4||
|
|
Highlights
………………………………………………………………………………………………..
|
Leave a Reply
To write the response in తెలుగు (Type the matter at this site and paste in the comments box below)