|
Context
Song Context:
తొలిప్రేమ |
Song Lyrics
||ప|| |అతడు|
ఈ మనసే సె సె సె..
నా మనసే సె సె సె..
పరుగెడుతోందే నీకేసే వినమంటోంది తన ఊసే
అలలెగసి కలవరమాయే తనలో నిను చూసే
||ఈ మనసే ||
.
||చ|| |అతడు|
ఎన్నో కలలను చూసే
కన్నే కునుకొదిలేసే
నువ్వే తను వెతికే నా తొలివెలుగని తెలుసే ||ఎన్నో కలలను ||
కోరుకున్న తీరాన్నే తాను చేరినా
తీరిపోని ఆరాటంతో కలవరించెనా
వెనకనె తిరుగుతు చెలి జత విడువదు
దొరికిన వరముతొ కుదురుగ నిలువదు
ఏం చేస్తే బావుంటుందో చెప్పని వింతనసే
||ఈ మనసే||
.
||చ|| |అతడు|
నీతో చెలిమిని చేసే
నీలో చలువను చూసే
అయినా ఆ ఇంకా ఏదో అడిగే అత్యాశే ||నీతో ||
వెల్లువంటి నీ స్నేహం నన్ను అల్లినా
వెన్నెలంటి నీ నవ్వుల్లో చెంపగిల్లినా
తహతహ తరగదు అలజడి అణగదు
తన సొద ఇది అని తలపులు తెలుపదు
ఏమిస్తే శాంతిస్తుందో తెలుసా ఏం వరసే
||ఈ మనసే ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »