|
Context
Song Context:
నీ నవ్వే కడ దాకా నా కలిమి
ఈ నువ్వే కొస దాకా నా బలిమి
|
Song Lyrics
||ప|| |ఆమె|
నీ నవ్వే కడ దాకా నా కలిమి
అతడు:
ఈ నువ్వే కొస దాకా నా బలిమి ||2||
ఆమె:
మైమరపించే ఈ మాటలనే నెరనమ్మి
నీ చిటికెన వేలు పట్టి నడిచింది నా చెలిమి
అతడు:
ఆ చెలిమి… నా బలిమి
ఆమె:
ఆ చెలిమి…. నా కలిమి
|ఆమె| ||నీ నవ్వే|| |అతడు| ||ఈ నువ్వే ||
.
చరణం: ఆమె:
గాలివాటు పరుగులే కానీ నేల మీద నిలబడవేమి
కల్లబొల్లి కబురుల హామీ కడుపు నింపుతుందా స్వామీ
అతడు:
అంబరాన జాబిలినీ…అంబరాన జాబిలిని అందుకున్న వాడిననీ
పొగడరాదా నా పోడిమి…తగువులాడతావేమి
ఆమె:
తిమ్మిని బమ్మిని చేసే తెలివికి లేదే లేమి
నీ కొంటెదనానికి కొంచెమైనా నాక్కోపం రాదేమి
అతడు:
ఆ చెలిమి…. నా బలిమి
ఆమె:
ఆ చెలిమి…. నా కలిమి
.
చరణం: ఆమె:
పెనిమిటిగా దొరికాడండి పాతికేళ్ల పసి పాపాయి
వీసమెత్తు రోషం లేని మీసకట్టు గల మొగలాయి
అతడు:
మాటకారినే గానీ మోసగాణ్ణి కాను అనీ ||2||
‘బాంచన్ నీ కాల్మొక్కుతా’… కసురుకోకే ఉరిమురిమి
ఆమె:
అబ్బా…కాలికి వేస్తే మెడకేసే తమ ఇచ్చకాలకేమి
ఆ గడుసుతనానికి కొంచెమైనా నాక్కోపం రాదేమి
అతడు:
ఆ చెలిమి…. నా బలిమి
ఆమె:
ఆ చెలిమి…. నా కలిమి…..
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A brilliantly crafted song! A Sirivennela Special!
The characterization of both of them is completely presented in the lyrics of this matured love song by భార్యా భర్తలు!
……………………………………………………………………………………………….. |
No Comments »