|
Context
Song Context:
గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు!
(A native love song of భార్యా భర్తలు!)
|
Song Lyrics
||ప|| |ఆమె|
శ్రీవారు దొరగారు.. అయ్‌గోరు..
ఏంటండి మీ పేరు.. ఆయ్ చెప్పండి
వరదల్లే ప్రేమే పొంగి ఉరకలు వేసే వేళ
ముదుముద్దుగ అంటాలెండి మీ సరదా తీరేలా
డార్లింగ్ గారు… డార్లింగ్ గారు…
|అతడు|
గారు ఎందుకె బంగారు వింటుంటే కంగారు…
గారంగా శృంగారంగా డార్లింగ్ అంటే చాలు.
డార్లింగు కి లింగు లిటుకూ లింకులు పెడితే బోరు…
ఓ మై డియరూ.. ఓ మై డియరు..
.
||చ|| |అతడు|
నరనరాల్లో చలి జ్వరం చూడు తెగ కరుస్తున్నది.. ఏం చెయ్యనే
|ఆమె|
కలవరంలోన చెలి వరం కోరు నస తెలుస్తున్నది.. మందియ్యనా
|అతడు|
కనుక్కోవా కుశలం కాస్తైనా…
|ఆమె|
అతుక్కోను సమయం చూస్తున్నా
|అతడు|
నచ్చావే నాటీ నాంచారు… ఓ మై డియరూ..
|ఆమె| శ్రీవారు దొరగారు… |అతడు| మే బీ శ్రీమతి గారు..
.
||చ|| |ఆమె|
ఓ యమ తమాషాల తమ తతంగాల బుస భరించేదెలా..ఇంటాయనా..ఓయ్
|అతడు|
మిసమిసల్లోని రస రహస్యాన్ని రగిలిస్తే మెల్లగా.. చల్లారునో
|ఆమె|
నిగారల సొగసులు ఇవ్వాలా
|అతడు|
ఇలాంటేళ అనుమతి కావాలా
|ఆమె|
తయ్యారు అయ్యారా మీరు.. డార్లింగ్ గారు
|అతడు|
అబ్బా… ఇంకానా?
ప్యారీ పెళ్లాంగారు
మే బీ శ్రీమతిగారు
సరసంలో ముద్దే ముదిరి హద్దులు చెరిగే వేళ
చిలకల్లే చిలిపిగ నన్ను పిలవాలే ప్రియురాలా… ఓ మై డియరూ
|ఆమె|
మా ఊళ్లో ఆడాళ్లు ఏమయ్యో అంటారు
ఆ పిలుపే మోటుగ ఉంటే మారుస్తాలే తీరు
డార్లింగుకి గారొద్దంటే తీసేస్తాలే సారు
|అతడు| ఓ మై డియరూ…హాయి హాయి డియరూ.. |ఆమె| రా మై డియరూ…
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »