Archive for the ‘జోలపాట’ Category

తారక రాముడు: హాయి హాయి హాయి వెన్నెలమ్మ

Audio Song:
 
Movie Name
   Tharaka Ramudu
Song Singers
   S.P. Balu
Music Director
   Koti
Year Released
   1997
Actors
   Srikanth,
   Soundarya
Director
   R.V. Uday Kumar
Producer
   K. Shobhan Babu,
   M. Sudhakar

Context

Song Context:
     తీయ తీయనైన పాట పాడనీయి, బాధ పోని రానీ హాయి
     చలువ కురిపించనీ ఇలా ఇలా ఈ నా పాటని!

Song Lyrics

పల్లవి:
       హాయి హాయి హాయి వెన్నెలమ్మ హాయి హాయి హాయి హాయి హాయి
       తీయ తీయనైన పాట పాడనీయి బాధ పోని రానీ హాయి
       చురుకుమనే మంటకు మందును పూయమనీ
       చిటికెలలో కలతను మాయము చేయమనీ
       చలువ కురిపించనీ ఇలా ఇలా ఈ నా పాటని
                                                   ||హాయి||
.
చరణం:
       కనులు తుడిచేలా ఊరడించే ఊసులాడే భాషే రాదులే
       కుదురు కలిగేలా సేవజేసి సేదతీర్చే ఆశే నాదిలే
       వెంటనే నీ మది పొందనీ నెమ్మది అని తలచే ఎదసడిని
       పదమై పలికి మంత్రం వేయనీ
                                                   ||హాయి||
.
చరణం:
       మొరటుతనమున్నా పూవులాంటి నిన్నుగాచే ముళ్ళై నిలవనా
       మన్నులో ఉన్నా చిగురువేసే నీకు నేనే వేరై ఒదగనా
       నువ్విలా కిలకిలా నవ్వితే దివ్వెలా కడవరకు ఆ వెలుగు
       నిలిపే చమురై నేనే ఉండనా
                                                  ||హాయి||
.
.
                            (Contributed by Prabha)

Highlights

   వెంటనే నీ మది పొందనీ నెమ్మది,
   అని తలచే ఎదసడిని పదమై పలికి మంత్రం వేయనీ

.
   నువ్విలా కిలకిలా నవ్వితే,
   దివ్వెలా కడవరకు ఆ వెలుగు నిలిపే చమురై నేనే ఉండనా
………………………………………………………………………………………………..