|
Context
Song Context:
చెల్లి పెళ్ళిలో అల్లరి!
|
Song Lyrics
|కోరస్|
భం భం భో..||6||
హుప్ హుప్ హుప్ ఆయె హుప్స్ ||4||
||ప|| |అతడు|
ఎప్పుడెప్పుడెప్పుడంది పిల్ల మొగ్గ
గుప్పు గుప్పు గుప్పు మంది మల్లె మొగ్గ
పెళ్ళిమాట విన్నదేమో పిల్లకోతి ఫేసుకూడ చూడ చక్కగానె ఉందిరోయ్
జీన్స్ పాంట్ పక్కనెట్టి పట్టు పావడాలు కట్టి ఆడపిల్ల లాగె ఉందిరోయ్
|| హుప్స్||
.
||చ|| |అతడు|
అమ్మదీని తస్సదియ్య నమ్మరాని పిల్లదయ్య
ఆకతాయి ఆర్ట్ లోన ఆరితేరిపోయెనయ్యా..
ప్రిన్స్ లాంటి పిల్లగాన్ని పర్సులోన పెట్టుకుందయ్య..
|ఆమె|
అల్లరొద్దు నల్లనయ్య అంతసీను లేదురయ్య
అమ్మకూచి నిన్ను చూసి నేర్చుకుంది చిన్నమాయ
రాలుగాయి లీలలొన నీకు సాటి లేరులేవయ్యా
|అతడు|
ఆటలొచ్చు పాటలొచ్చు అల్లరొచ్చు నవ్వులొచ్చు ఎడ్పంటె చేతకాదయ్యా..
చెల్లి పెళ్ళి తోసుకొచ్చి కళ్ళనీళ్ళు తీసుకొచ్చె
రాని విద్య నేర్పుతుందయ్యా..
||హుప్||
.
||చ|| |అతడు|
కాలు మీద కాలు వేసి వేలితోన సైగచేసి
బాలరాజు ఫోజుకొట్టి ఫీలయింది చాలు గాని
పెళ్ళి పెద్ద ఫేసుపెట్టి ఒళ్ళు వంచి పనులు చేయరా
ఇల్లు పీకి పందిరేసి పెళ్ళుమంటు పెళ్ళిచేసి
పందెమేసి చిందులేసి రెచ్చిపోయి రచ్చకెక్కి
సంతగోల చేయడానికి ఇంతకంటే చాన్సులేదురా
దీన్ని పెళ్ళిసందడంటు ఒప్పుకోక తప్పదంటూ
చుట్టుపక్కలున్న అందరూ పిచ్చికోపమాపుకుంటు
వెర్రి నవ్వు నవ్వుకుంటు చచ్చినట్టు సర్దుకుందురు
||హుప్స్||
.
||చ|| |అతడు|
తాగుతున్నదేమో ఒట్టి కోకకోలా
|కోరస్|
కాక్ టైల్ తాగినంత కాకిగోల
|అతడు|
బీరుమందు చూడగానె ఆరునెల్లు తేరుకోని ఓరుగల్లు వీరమల్లురోయ్
దేవదాసు తోసుకెళ్ళి పక్కనున్న చుక్కనైన కుక్కపిల్లలాగా చోడరోయ్
హుప్ హుప్ హుప్ ఆయె హుప్స్ ||16||
.
.
(Contributed by Venkata Sreedhar) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »