|
Context
Song Context:
అబ్బాయి లవ్ మారేజి చేసుకుంటాడంట, పిల్లని కూడా చుసేసుకున్నాడు.
అప్పుడు కుటుంబంలో సంభాషణ ఇలా!
|
Song Lyrics
||ప|| |నానమ్మ|
విన్నవంట్రా అబ్బాయి నీ అబ్బాయికి పాపం లవ్ అయిందంటా
నువ్వు నీ ఇల్లాలు కలిసి ఓకే అంటే చాలు పెళ్ళవుతుందంటా
|నాన|
పెరెంట్స్ అంటే పెళ్లికి పిలిచే పెరంటాళ్ల ఏమిటి నువ్వే చెప్పమ్మా
మాకు కాబోయే కోడలు ఎవరో వూరుపేరుగట్రా వివరాలేంటమ్మా
|కొడుకు|
చూడచక్కనది నేనే ఎంతో మెచ్చినది
నన్ను దోచినది నాకెంతో నచ్చినది
రంభ రోజా మీనాలాగ మురిసి
మురిపించి మరిపించేలాగ వుంది
.
|చరణం||నానమ్మ|
మనీషా టాబూ లాంటి వాళ్ళు కొడలైతే నీకిష్టమా
|నాన|
మమ్మీ వినవే పవిత్రబంధం సౌందర్యలాగ వుంటే సరే
|నానమ్మ|
ఆడపడుచె అర్ధమొగుడని మోటు సామెత ఒకటుంది
నీ అన్నపెళ్లాం ఎట్టావుంటే నీకు ఇష్టమో సిస్టర్జీ
|చెల్లి|
వచ్చే వదిన ఇట్టాగవుంటే నీకే నష్టం నానమ్మా
అందం చందం చెప్పే వయసు నీది కాదే ముసలమ్మా
చేతికి చెంబు మెడలో మాల కాశి… శివకాశి నీకే తప్పదు నానమ్మా
.
|చరణం| |నాన|
సుప్రీం కోర్టు జడ్జిమెంట్ నీదే కాదా భార్యమణి
|అమ్మ|
అయితే ఇంక అర్గుమెంట్స్ ఎందకండీ నాకిష్టమే
|నాన|
ఇంతమంది చెప్పినవన్ని విన్నావ్ కదరా ఓ మై సన్
|అమ్మ|
పాసయిందో లేదో చెప్పి చప్పున తీర్చెయి మా టెన్షన్
|కొడుకు|
అన్ని విధాల మేముకూదా అమ్మ పోలిక కాబట్టి
అచ్చంగా మీరనుకుంటున్నట్టే వుంటుందమ్మా గ్యరంటీ
చూశారంటే నా మ్యారేజికి మీరె నాకన్న తొందరపడతారండి
.
.
(Contributed by Phalgun) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »