|
Context
Song Context:
దడిలోని కుమారికి, నడి వీధి కుర్రోడికీ, కలిసింది ఇలా జత; కుదిరింది పెళ్ళి!
|
Song Lyrics
||ప|| |అతడు|
ఓలమ్మో ఓలమ్మో అని చిన్నా పెద్దా అంతా రండి
ఓలమ్మో ఓలమ్మో ఈ షాదీ భలే వింతేలెండి
|ఆమె|
షెహనాయి వినంగా సెహభాసు అనంగా
జనమంత కనంగా జరగాలి ఘనంగా
|అతడు|
బారాత్ హోరులో గందరగోళం
ఊరేగే దారిలో చిందుల మేళం
||ఓలమ్మో||
.
||చ|| |అతడు|
దడిలోని కుమారికి నడి వీధి కుర్రోడికీ
కలిసింది ఇలా జత వలపంటే అదే కదా
మట్టికి సొంతం చినుకన్నది
అది మబ్బులో ఎన్నాళ్లు ఒదిగుంటది
గాలికి జైలెక్కడ ఉన్నది
అది డోలీ తీసుకు వస్తున్నది
|ఆమె|
నయ్ నయ్ నయ్ నయ్ అంటే ఆగదురయ్యో
రయ్ రయ్ రయ్ రయ్ అంటూ సాగేనయ్యో
||ఓలమ్మో||
.
||చ|| |అతడు|
మగపెళ్లివాళ్లే ఇట్టా మొగమాటపడితే ఎట్టా
మన ధూల్పేట సత్తా చూపాలి కదా కాస్త
దామాద్ అంటే తెలిదేమిరా
జర మామకు దిమాగ్ చెడగొట్టరా
దర్జా తగ్గితే తగువెయ్యరా
మన బస్తీ ఇజ్జత్ నిలబెట్టరా
|ఆమె|
వెయ్ వెయ్ వెయ్ ఇలా సీఠీ వెయ్రా
అరె చెయ్ చెయ్ చెయ్ గలాటాలు చెయ్యరో
|| ఓలమ్మో||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Yet another పెళ్ళి song… డబ్బులున్న పిల్లకి, పేద పిల్లోడికి!
………………………………………………………………………………………………… |
|
No Comments »