Posted by admin on 26th September 2009 in
గాంధి
|
Context
Song Context:
The concept of “గాంధి” |
Song Lyrics
||అప|| |అతడు|
రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన సీతారాం
ఈశ్వర అల్లా తెరో నాం సబ్ కో సన్మతి దే భగవాన్
.
||ప|| |అతడు|
ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధి
ఊరికొక్క వీధి పేరు కాదురా గాంధి ||2||
కరెన్సీ నోటు మీద ఇలా నడి రోడ్డు మీద
మనం చూస్తున్న బొమ్మ కాదురా గాంధి
భరతమాత తలరాతను మార్చిన విధాతరా గాంధి
తరతరాల యమయాతన తీర్చిన వరదాతరా గాంధి
||ఇందిరమ్మ||
.
||చ|| |అతడు|
రామనామమే తలపంతా ప్రేమధామమే మనసంతా
ఆశ్రమ దీక్ష స్వతంత్ర కాంక్ష ఆకృతి దాల్చిన అవధూత
అపురూపం ఆ చరిత
కర్మయోగమే జన్మంతా ధర్మక్షేత్రమే బ్రతుకంతా
సంభవామి అని ప్రకటించిన అలనాటి కృష్ణ భగవద్గీతా
ఈ బోసినోటి తాత
మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధి
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్పూర్తి
సత్య అహింసల మార్గ జ్యోతి నవ శకానికే నాంది
||రఘుపతి|| |ఖోరస్| ||2||
.
||చ|| |అతడు|
గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత
చరఖా యంత్రం చూపించి స్వదేశీ సూత్రం నేర్పించి
నూలుపోగుతో మదపుటేనుగుల బంధించాడురా జాతి పిత
సంకల్ప బలం చేత
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
పదవులు కోరని పావన మూర్తి హృదయాలేలిన చక్రవర్తి
ఇలాంటి నరుడొకడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి
.
(సర్వజన హితం నా మతం; అంటరానితనాన్ని అంతః కలహాల్ని
అంతం చేసేందుకే నా ఆయువంతా అంకితం; హే రాం)
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Also view Sirivennela gaaru on video with his own personal tune as is, when the concept & lyrics were concieved.
Gandhi is NOT the last name of some people, statue in the street corner or picture on the currency paper, you see.
Gandhi is the one who changed the destiny of Bharat Mata by saving us from the generations of struggle and pain.
.
Gandhi is the story of love, dedication, ambition on achieving the goal.
Gandhi was born as an ordinary man like anyone of us and inspired us to get accolades as Mahatma.
Gandhi showed us the path with Satya and Ahimsa and the role model for the new age.
.
Gandhi is the true leader who showed us the way to achieve grand goals with simplicity and dedication.
Gandhi taught us the self dependence with our own in-house tools.
Gandhi showed the western side door to the British (the land of never sunset) and led us to the independence on August 15th 12AM.
Gandhi never strived for titles, awards but went on to rule our hearts.
Let us tell the next generations about Gandhi, before they couldn’t believe such a human existed in flesh and blood! (This line probably inspired from the original Albert Einstein’s quotation on Gandhi)
.
IS THERE ANY BETTER CONSUMMATE SUMMARY on “GANDHI”?
———————————-
A few highlights of Sirivennela’s awesome derivations (conceptually & linguistically & rhyming-rhythmically):
.
మన లాగే ఓ తల్లి కన్న మాములు మనిషి కదరా గాంధి
మహాత్ముడంటూ మన్నన పొందే స్థాయికి పెంచదా ఆయన స్పూర్తి
.
గుప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి
దండి యాత్రనే దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత
సిసలైన జగజ్జేత
.
సూర్యుడు అస్తమించని రాజ్యానికి పడమర దారిని చూపిన క్రాంతి
తూరుపు తెల్లారని నడిరాతిరికి స్వేచ్ఛా భానుడి ప్రభాత కాంతి
.
ఇలాంటి నరుడొకడిలా తలంపై నడయాడిన ఈనాటి సంగతి
నమ్మరానిదని నమ్మక ముందే ముందు తరాలకు చెప్పండి
.
………………………………………………………………………………………………… |
|
7 Comments »