Movie Name Mahatma Song Singers
Karthik, Sangeetha Music Director Vijay Anthony Year Released 2009 Actors Srikanth, Bhavana Director Krishna Vamsi Producer C.R. Manohar
Context
Song Context: నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా!
Song Lyrics
||ప|| |ఆమె|
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళ
|అతడు|
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఈ వేళ
|ఆమె|
హే నీ ఎదుట నిలిచే వరకు ఆపదట తరిమే పరుగు!
ఏం పనట తమతో తనకు తెలుసా?
|అతడు|
నీ వెనక తిరిగే కనులు చూడవట వేరే కలలు
ఏం మాయ చేశావసలు సొగసా!
||ఏం జరుగుతోంది ||
.
||చ|| |ఆమె|
పరాకులో పడిపోతుంటే కన్నె వయసు బంగారు
అరె అరె అంటూ వచ్చి తోడు నిలబడు
|అతడు|
పొత్తిళ్లల్లో పసి పాపల్లే పాతికేళ్ల మగ ఈడు
ఎక్కెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ
|ఆమె|
ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమే దూకుతోంది చిలిపి లాహిరి
|అతడు|
ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి
నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి
||ఏం జరుగుతోంది ||
.
||చ|| |ఆమె|
ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరు
|అతడు|
మధురమైన కబురందిందే కలత పడకు బంగారు
పెదవి తోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరు
|ఆమె|
గంగ లాగి పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
|అతడు|
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా
||ఏం జరుగుతోంది ||
.
.
(Contributed by Nagarjuna)
Highlights
.
ఆకాశమే ఆపలేని చినుకు మాదిరి
నీ కోసమే దూకుతోంది చిలిపి లాహిరి
. ఆవేశమే ఓపలేని వేడి ఊపిరి
నీతో సావాసమే కోరుతోంది ఆదుకో మరి .
గంగ లాగి పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
. అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా
…………………………………………………………………………………………………
Exclusively dedicated to analyze, discuss, exchange views on sirivennela's poetry and the philosophy behind, for and by the poetry loving community of the world