Archive for September 5th, 2009

జోష్: నీతొ వుంటే

Audio Song:
 
Movie Name
   Josh

Song Singers
   Karthik
Music Director
   Sandeep Chowta
Year Released
   2009
Actors
   Naga Chaitanya, Karthika
Director
   Vasu Varma
Producer
   Dil Raju

Context

Song Context: చెడు కూడా చెడుతుందె నీ సావాసాన్ని చేసి!

Song Lyrics

||ప|| |అతడు|
       నీతొ వుంటే ఇంకా కొణ్ణాళ్ళు ఏమవుతాయొ ఎదిగిన ఇన్నేళ్ళు
       నిన్నిప్పుడు చూస్తే చాలు చిన్నప్పటి చిలిపి క్షణాలు
                          గుండెల్లొ గువ్వల గుంపై వాలు
       నీతో అడుగేస్తే చాలు మునుముందుకు సాగవు కాళ్ళు
                          వుంటుంధా వెనకకి వెళ్ళే వీలు
       కాలాన్నే తిప్పేసింధి లీలా బాల్యాన్నే రప్పించింధి వేళా
       పెద్దరికాలన్ని చినబోయేలా పొద్దెరగని మరుపేదో పెరిగేలా
                                              ||నీతొ వుంటే||
.
||చ|| |అతడు|
       నిలబడి చూస్తాయే ఆగి లేళ్ళు సెలయేళ్ళు చిత్రంగా నీవైపలా
       పరుగులు తీస్తాయే లేచి రాళ్ళు రాదార్లు నీలాగా నలువైపులా
       భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
       సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
       చేదైనా తీపవుతుందే నీ సంతోషం చూసి
       చెడు కూడా చెడుతుందె నీ సావాసాన్ని చేసి
                                               ||నీతొ వుంటే||
.
||చ|| |అతడు|
       నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ గమనించే ఆశ్చర్యమా
       ఏ పని చేస్తున్నా ఏదొ ఘనకార్యం లాగే గర్వించే పసి ప్రాయమా
       చుక్కలన్ని దిగి నీ చుపుల్లొ కొలువు వుండి పోగా
       చీకటన్నదిక రాలేదే నీ కంటిపాప దాకా
       ప్రతి పూటా పండుగ లాగే వుంటుందనిపించేలా
       తెలిసేలా నేర్పేటందుకే నువ్వే పాఠశాల   ||2||
                                                ||నీతొ వుంటే||
.
.
                    (Contributed by Vijaya Saradhi)

Highlights

Is this a love song? or is it a song on స్నేహం between any two good friends! Amazing universalization!
.
భూమి అంత నీ పేరంటానికి బొమ్మరిల్లు కాదా
సమయమంత నీ తారంగానికి సొమ్మసిల్లి పోదా
.
లేళ్ళు సెలయేళ్ళు ఆగి నిలబడి చూస్తాయే చిత్రంగా నీవైపలా!
.
ప్రతి పూటా పండుగ లాగే వుంటుందనిపించేలా, తెలిసేలా నేర్పేటందుకే నువ్వే పాఠశాల! (the ultimate punch line!)
.
Enjoy the complete lyrics of this masterpiece!
……………………………………………………………………………………………..