|
Context
Song Context:
జళ్ళోని సన్నజాజిని నా మోజు విన్నవించనీ
గాజుల్లో సవ్వడి విని పోల్చాను సంగతిదనీ!
|
Song Lyrics
||ప|| |ఆమె|
ప్రేమ ఎన్నికలోన పెళ్ళి టిక్కెట్ పైన
నన్నే నెగ్గావుగా మరి నువ్వే నా ముఖ్యమంతిరి
అతడు:
భామ కౌగిలిలోన భర్త పదవికి రానా
బాగుంది కొత్త నౌకిరి చేస్తాలే చిలిపి చాకిరి
ఆమె :
చుక్క సోకులే నువు చక్క బెట్టుకో
చక్రవర్తిలా జతచేరి
అతడు:
పడుచు సొంపులే నా జంట పెట్టుకో
పట్టమహిషిలా ఒడి చేరి
ఆమె :
ఐదేళ్ళ ఓటు కాదిది వందేళ్ళు ఉండమన్నది
అతడు:
అందాల స్వప్న సుందరి నా వేలు అందుకున్నది
||ప్రేమ||
.
చరణం : ఆమె :
నీనేస్తమే నానుదిటి కుంకుమై నీ కోసమే ఈ కొత్త పుట్టుక
అతడు:
నా దారిలో దీపాలు చూపగా జారిందిరా ఆనింగి తారక
ఆమె :
వెంటపడ్డ చీకటి కంటి కాటుకైనది జంటకట్టి నువ్వు ఆదుకోగా
అతడు:
పంచుకున్న ఊపిరి పెంచుకున్న ఆవిరి అంటుకున్న రేయి పారిపోగా
ఆమె :
జళ్ళోని సన్నజాజిని నా మోజు విన్నవించనీ
అతడు:
గాజుల్లో సవ్వడి విని పోల్చాను సంగతిదనీ
||ప్రేమ||
.
చరణం : అతడు:
రోజు రోజుకీ ఇంకాస్త పచ్చగా పూలు తొడగనీ
మురిపాల వేడుక
ఆమె :
పూట పూటకీ సంక్రాంతి పండుగ ఇంట చేరనీ
నీ సాక్షిగా ప్రియా
అతడు:
వెన్నెలంటి నవ్వులా తోడు ఉంటె నువ్విలా
ఓడిపోను ఎవ్వరెదురైనా
ఆమె:
గుండెలోని గువ్వలా దాచుకుంటే నన్నిలా
నేను అంటూ వేరే వున్నానా
అతడు:
ప్రేమన్న మల్లెపందిరి మన చుట్టు అల్లుకున్నది
ఆమె :
లోకంలో స్నేహం అన్నది మన పేరే పెట్టుకున్నది
||ప్రేమ||
.
.
(contributed by ఆచళ్ళ శ్రీనివాసరావు) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
2 Comments »