Archive for May 19th, 2010

యువసేన: లోకాసమస్తా సుఖినోభవంతు ఆ వేదం మా ఎద నాదం

Audio Song:
 
Movie Name
   Yuvasena
Song Singers
   Sandeep
Music Director
   Jassie Gift
Year Released
   2004
Actors
   Bharat,
   Gopika,
   Sashank
Director
   Jaya Raj
Producer
   Sravanthi RaviKishore

Context

Song Context:
      లోకాసమస్తా సుఖినోభవంతు ఆ వేదం మా ఎద నాదం!

Song Lyrics

||ప|| |అతడు|
       లోకాసమస్తా సుఖినోభవంతు ఆ వేదం మా ఎద నాదం
       ఆ మాటకర్థం ఇదిగో ఇదంటూ చూపాలి మన జీవితం
       అందరిలా నిద్దర్లో ఉండిపోక చీకటినే వేటాడుతాం
       పాపాన్ని పసికట్టే చూపులతో పహారా కాస్తూనే ఉంటాం
                                    ||లోకాసమస్తా||
.
||చ|| |అతడు|
       ఎప్పటికప్పుడు తప్పును తప్పని చెప్పక తప్పదుగా
       పచ్చని పైరుకి పట్టిన చీడని తూల్చక తప్పదుగా
       నీతికి చితిపెట్టే చేతికి నిప్పంటే చెబుతాం
       నెత్తురు చవిచూపే కత్తికి నొప్పిని చూపెడతాం
       చేస్తున్నాం ధర్మమని తోచిందేదోఫలితం ఏదైనా మేం సిద్ధం
.
||చ|| |అతడు|
       అందరికీ అమృతం అందేలా గరళం సేవిస్తాం
       అందరి భారం శిలువై మోసిన కరుణై గర్విస్తాం
       రాత్రిని కరిగించే వేకువ కోసం మా పయనం
       ధాత్రిని రక్షించే క్షాత్రవ సైన్యం మా ధైర్యం
                                    ||లోకాసమస్తా||
.
.
                  (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………