|
Context
Song Context:
పోరాటం పొందే గెలుపే అదీ - ప్రేమంటే ఇంతే! |
Song Lyrics
||ప|| |ఆమె|
ప్రేమంటే ఇంతే తెలుసా మరి
పోరాటం పొందే గెలుపే అదీ
సావాసం వెంటే వెళితే సరి
ఆకాశాన్నంటే పరుగే అదీ
కాలానికే ఈ సంగతి ఎన్నాళ్ళకైనా ఇంకా సరికొత్తే
|అతడు|
ప్రేమంటే ఇంతే తెలుసా మరి
పోరాటం పొందే గెలుపే అదీ
.
||చ|| |అతడు|
గాయాలతోనే గేయాలు రాసే కావ్యం కదా ప్రేమా
|ఆమె|
మరణానికైనా ప్రాణాలు పోసే మంత్రం కదా ప్రేమా
|అతడు|
ప్రియ మంత్రం కదా ప్రేమా
|ఆమె|
మరోసారి మన చెలిమి లోకానికి చవి చూపాలి ఓ మాధురి
|అతడు|
విరహాలకి వివాదాలకి ఎదురీదడం తెలిసుంటే చాలంతే
|ఆమె| ||ప్రేమంటే ఇంతే||
.
||చ|| |అతడు|
తడబాటుకైనా నాట్యాలు నేర్పే నేస్తం కదా ప్రేమా
|ఆమె|
నిరుపేదనైనా మహరాజు చేసే రాజ్యం కదా ప్రేమా
|అతడు|
ఓ రసరాజ్యం కదా ప్రేమా
|ఆమె|
ఎటో తూలిపోతున్న మైకానికి రహదారైంది ఆ లాహిరి
|అతడు|
నీతో జత కలిసే కధా రానున్న జంటలు సాగే పూబాటే
|| ప్రేమంటే || |ఇద్దరు|
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »