Archive for May 28th, 2010

ప్రేమంటే ఇంతే: ముందే ముడిపడి ఉందే మన జత అందే నీ మమత

Audio Song:
 
Movie Name
   Premante Inthe
Song Singers
   Hema Chandra,
   Chaitra
Music Director
   Koti
Year Released
   2006
Actors
   Navadeep,
   Poonam Bajwa
Director
   Ramana B.V.
Producer
   Sravanthi RaviKishore

Context

Song Context:
    Yet another logic-packed love song!

Song Lyrics

||ప|| |ఆమె|
       ముందే ముడిపడి ఉందే మన జత అందే నీ మమత
|అతడు|
       చిందే మధువుల విందై సొంతమయిందే స్నేహలతా
|ఆమె|
       ఆశగా ఇమ్మనీ ఆశగా కోరనీ
|అతడు|
       అల్లుకో రమ్మనీ చల్లగా చేరనీ 
||ముందే ముడిపడి||
.
||చ|| |అతడు|
       నిన్నలా నన్ను నన్నులా చూపదేమిటో అద్దం ఈ వేళా
       ఇంతలా ఎన్ని వన్నెలా నాకు మహ ముద్దొచ్చేసేలా
|అతడు|
       నువ్వలా నవ్వితే ఎలా గుండెలో ఏదో గుబులును రేపేలా
       అంతలా వింత సైగలా సంగతేమిటో ఊహకు వదిలేలా
|ఆమె|
       పదుగురి ఎదురుగ పెదవులనడగకు అవి ఇవి పలకమని
       మనసుకి మనసుకి కుదిరిన వరసల వివరము తెలపమని
|అతడు|
       తళతళ మెరిసిన కనులను అడిగితె తెలియదటే రమణీ
       తలచుకు తలచుకు మురిసిన మనసున ఒదిగిన కబురిదనీ
|ఆమె|
       ఆశగా ఇమ్మనీ ఆశగా కోరనీ
|అతడు|
       అల్లుకో రమ్మనీ చల్లగా చేరనీ
                                  || ముందే ||
.
||చ|| |అతడు|
       కొద్దిగా హద్దు మీరగా పక్క చేరగా తడబడతావేలా
       బొత్తిగా సిగ్గు చాటుగా మొక్క తీరుగా ముడుచుకుపోవాలా
|ఆమె|
       వీలుగా వచ్చి వాలక జోలి జాలిగా నిలబడి చూడాలా
       వేడిగా వయసు వేడుక అదుపు దాటగా అనుమతి కావాలా
|అతడు|
       దొరకక దొరకక దొరికిన నిను విడి వెనుకకు మరలననీ
       మెలికలు తిరిగిన మెరుపున తరిమిన తలపులు స్థిరపడనీ
|ఆమె|
       చిలిపిగ చిదిమిన తహ తహ తలపుల తపనకు తాళననీ
       నిలువున విరిసిన సొగసుల బరువిక నీబహుమతి అవనీ
|అతడు|
       అల్లుకో రమ్మనీ చల్లగా చేరనీ
|ఆమె|
       ఆశగా ఇమ్మనీ ఆశగా కోరనీ
.
.
                (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………………