Posted by admin on 11th June 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |అతడు|
ఎట్టాగో ఉన్నాది ఓలమ్మి ఏటేటో అవుతుంది చిన్నమ్మి ||2||
|ఆమె|
అట్టాగే ఉంటాది ఓరబ్బి ఏటేటో అవుతాది చిన్నబ్బి ||2||
.
||చ|| |అతడు|
ఎండల్లో చలెక్కుతోంది గుండెల్లో కలుక్కుమంది
నువ్వట్టా నరాలు మెలేసి నడుస్తు వస్తుంటే
|ఆమె|
సిగ్గంతా చెడేట్టు ఉంది చిక్కుల్లో పడేట్టు ఉంది
చూపుల్తో అటొచ్చి ఇటొచ్చి అతుక్కుపోతుంటే
|అతడు|
కొంపలు ముంచకు దుంపతెగ
|ఆమె|
కోకకు పెంచకు కొత్త సెగ
|అతడు|
గమ్మత్తుగ మత్తెక్కించే వేళా
నువ్ హీటెక్కి పోతుంటే ఓలమ్మి
పైటెక్కడుంటుందే చిన్నమ్మి ||2||
||అట్టాగే ఉంటాది||
.
||చ|| |ఆమె|
కళ్లల్లో అదేమి కైపో నడకల్లో అదేమి ఊపో
నిలువెల్లా తెగించి తెగించి ఎగబడిపోతుంటే
|అతడు|
ఒంపుల్లో అదేమి నునుపో సొంపుల్లొ అదేమి మెరుపో
వాటంగా వయస్సు వలేసి తికమకపెడుతుంటే
|ఆమె|
తూలకు తూలకు తిమ్మిరిగా
|అతడు|
తుళ్లకు తుళ్లకు తుంటరిగా
|ఆమె|
ఓళ్లంతా గల్లంతైపోయేలా
|అతడు|
జడ ఊపి నడుమూపి నిగనిగల నిధులుచూపి
నువ్వీరంగం వేస్తుంటే ఊరంత ఊగిందే చిన్నమ్మి
వీరంగం వేస్తుంటే ఊరంత ఊగిందే చిన్నమ్మి
||ఎట్టాగో ఉన్నాది ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »