|
Context
Song Context:
నేలమ్మ తప్పతాగేనో ఏ మూల తప్పిపోయెనో
మేఘాల కొంగుపట్టుకో తూలేటి నడకనాపుకో |
Song Lyrics
||ప|| |అతడు|
కన్యాకుమారి కనపడదా దారి కయ్యాలమారి పడతావే జారి
పాతాళం కనిపెట్టేలా ఆకాశం పనిపట్టేలా ఊగకే మరి మతిలేని సుందరి
|ఖోరస్|
జింగుచకు జింగుచకు జాం చకు జింగుచకు జింగుచకు జాం
|ఆమె|
గోపాలా బాలా ఆపర ఈ గోల ఏ కైపు ఏలా ఊపర ఉయ్యాల
మైకంలో మయసభ చూడు మహరాజా రానా తోడు
సాగనీ మరి సరదాల గారడీ
|ఖోరస్|
జింగుచకు జింగుచకు జాంచకు జింగుచకు జింగుచకు జాం
.
||చ|| |ఆమె|
కొండలు గుట్టలు చిందులాడే తధిగిణతోం
|అతడు|
వాగులు వంకలు ఆగి చూసే కథ చెబుదాం
|ఆమె|
తూనీగ రెక్కలెక్కుదాం సూరిడు పక్కనక్కుదాం
|అతడు|
కుందేటి కొమ్ము వెతుకుదాం బంగారు జింకనడుగుదాం
|ఆమె|
చూడమ్మో హంగామా
|అతడు|
అడివంతా రంగేద్దాం సాగించే వెరైటీ ప్రోగ్రాం
కళ్ల విందుగా పైత్యాల పండగ
|ఖోరస్|
జింగుచకు జింగుచకు జాంచకు జింగుచకు జింగుచకు జాం
|| కన్యాకుమారి ||
.
||చ|| |అతడు|
డేగతో ఈగలే ఫైటు చేసే చెడుగుడులో
|ఆమె|
చేపలే చెట్టుపై పళ్లు కోసే గడబిడలో
|అతడు|
నేలమ్మ తప్పతాగేనో ఏ మూల తప్పిపోయెనో
|ఆమె|
మేఘాల కొంగుపట్టుకో తూలేటి నడకనాపుకో
|అతడు|
ఓయమ్మో మాయమ్మో
|ఆమె|
దిక్కుల్నే ఆటాడించే కిక్కుల్లో గందరగోళం ఒళ్లు ఊగగా ఎక్కిళ్లు రేగగా
|ఖోరస్|
జింగుచకు జింగుచకు జాం చకు జింగుచకు జింగుచకు జాం
|| గోపాలా బాలా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
Follow this interesting flow of very structured comedy!
These two folks are drunk, of course!
……………………………………………………………………………………………. |
|
No Comments »