|
Context
Song Context:
చిరుహాసానికే మా సంసారమే చిరునామా అని
ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని
ప్రతిరోజు పండుగల్లె సాగుతుంది జీవితం!
|
Song Lyrics
||ప|| |అతడు|
ఓ వెండి వెన్నెల దిగిరా ఇలా
అమ్మకొంగులో చంటిపాపలా
మబ్బుచాటునే ఉంటే ఎలా
పడిపోతానని పసిపాదాలకి పరుగే నేర్పవా
మదిలో దాగినా మధుభావాలకి వెలుగే చూపవా
మనసుంటే మార్గముంది తెంచుకోవే సంకెళా
.
చరణం: ఆమె:
ఓ సుప్రభాతమా ఓ శుభమంత్రమా
మేలుకొమ్మనే ప్రేమగీతమా
చేరుకున్నదా తొలిచైత్రమా
నీ స్వరాలతో నా నరాలలో ఒక గంగానది
ఈ క్షణాలనే జతచేరాలని అలలౌతున్నది
వెల్లువలా చేరుకోనా వేచియున్న సంద్రమా
.
చరణం: అతడు:
అంత దూరమా స్వర్గమన్నది చిటికెలో ఇలా మనదైనది
ఆమె:
అందరానిదా స్వప్నమన్నది అందమైన ఈ నిజమైనది
ఇద్దరు:
చిరుహాసనికే మా సంసారమే చిరునామా అని
ఆమె:
ఈ సంతోషమే మా సంతానమై చిగురించాలని
ప్రతిరోజు పండుగల్లె సాగుతుంది జీవితం
.
.
(Contributed by Pradeep) |
Highlights
………………………………………………………………………………………………..
|
1 Comment »