|
Context
Song Context:
బతుకంటే ప్రతి నిమిషం తరగని ఓ పోరాటం
తెగువుంటే తెలివుంటే నిలబడురా ఎంతటి గండం
సాహసంతో సాగిపోరా… సాగరాలే దాటిపోరా
అనుకుంటే అణువణువూ atom bomb అయిపోదా!
|
Song Lyrics
||ప|| |అతడు|
ఏక్ దో తీన్ ఆగే చల్ - ఏక్ దో తీన్ చల్ ఆగే చల్
ఏ ప్రమాదం ముంచుకురాని Don’t you run?
నీ ప్రయాణం ముందుకుపోనీ ఏక్ దో తీన్
బతుకంటే ప్రతి నిమిషం తరగని ఓ పోరాటం
తెగువుంటే తెలివుంటే నిలబడురా ఎంతటి గండం
సాహసంతో సాగిపోరా… సాగరాలే దాటిపోరా ||2||
||ఏ ప్రమాదం||
.
||చ|| |పిల్లలు|
వెయ్ తమాషా తికమక తాళం My dear gun
చెయ్ గలాటా గందరగోళం want great fun
hey పహెల్వాన్! చెయ్యి action
why పరేషాన్? నువ్వే he-man..
|అతడు|
వలలుపెట్టి ఈ విలన్ గ్యాంగులనొక చూపు చూడగా
నిలువు గొయ్యి తీయ్.. ఒక్క తోపు తొయ్
వరసపెట్టి ఈ మిరపదండుని తగలబెట్టురా
అగ్గి పుల్ల గీయ్… బుగ్గి పాలు చెయ్
భయపడుతూ పరిగెడితే వదలదురా దుర్మార్గం
నరనరము చురుకుతనం చూపెడితే గెలుపే ఖాయం
జోర్ సే మారో.. ఏం మజారో
ఈ క్షణంలో… నీవే హీరో
.
||చ|| |అతడు|
ఎదురుతిరుగు ఈ పొగరుబోతులకు బెదురు పుట్టగా
తగిన ఎత్తు వెయ్… తరిమి చిత్తు చెయ్
మెడలు లేని ఈ మకురు గొడ్డులను వదిలిపెట్టక
నడ్డి విరగదీయ్.. గడ్డి కొరకనీయ్
వేటాడే సైతానుల దుమ్మంతా దులిపేసెయ్
వెంటాడే భూతాలను ఈ క్షణమే భస్మం చేసెయ్
జోర్ సే మారో.. ఏం మజారో
ఈ క్షణంలో… నీవే హీరో
.
|పిల్లలు!
జై జవానై చెయ్యర యుద్ధం ధన్ ధనా ధన్
చెయ్ సవాల్ చెయ్ దుష్టుల తంత్రం
|అతడు2|
wow..well done
|అతడు|
అనుకుంటే అణువణువూ atom bomb అయిపోదా
తలబడుతూ నిలబడితే యముడైనా తలవంచెయ్‌డా
జోర్ సే మారో.. ఏం మజారో ఈ క్షణంలో… నీవే హీరో
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »