|
Context
Song Context:
A love song! |
Song Lyrics
||ప||అతడు|
కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా
తేనెబొమ్మ తేనెబొమ్మా తీపి పెదవి అందనీమ్మా
ఎదకుపంటిలో వెన్నెల రాజేసి కోరికతో వయసు ఉడికిపోతుంటే
ఆమె:
కూనలమ్మ కూనలమ్మా కూనిరాగమందుకోమ్మా
అతడు:
తేనెబొమ్మ తేనెబొమ్మా తీపి పెదవి అందనీమ్మా
ఆమె:
ఎదకుపంటిలో వెన్నెల రాజేసి కోరికతో వయసు ఉడికిపోతుంటే
||కూనలమ్మ||
.
చరణం: అతడు:
చెక్కిలి అద్దమా తడి ముద్దుకు సిద్ధమా
అతడు: ఏమ్మా ఆమె: ఏమో
అతడు: రామ్మా ఆమె: వామ్మో
ఆమె: తుంటరి నేస్తమా అంత అల్లరి ఆత్రమా
ఆమె: ఆశా అతడు: ఏమో
ఆమె: చూశా అతడు: వామ్మో
అతడు:
నడుమెక్కి ఆడేటి జడనిగ్గు చూస్తుంటే - నిలువున చలి పుట్టే చిలకమ్మా
ఈడు చెలరేగిపోతుంది చూడమ్మా
ఆమె:
ఒద్దొద్దు అంటున్న ఉత్తుత్తి - సిగ్గుల్ని వాటంగా దాటేసి రారాదా
వచ్చి దర్జాగ దోచేసిపోరాదా అంటూ
ఎదకుపంటిలో వెన్నెల రాజేసి కోరికతో వయసు ఉడికిపోతుంటే
||కూనలమ్మ||
.
చరణం: అతడు:
వద్దకు చేరనా వేడి ముద్దులు కోరనా
అతడు: రానా ఆమె: ఊహు
అతడు: పోనా ఆమె: ఊహుహూ
ఆమె: వద్దని ఆపినా వదలొద్దని ఆగినా
ఆమె: తగువే అతడు: ఓహో
ఆమె: తగునా అతడు: ఆహా
అతడు:
మనసైనా నీతోనే మనువైన నీతోనే - నా మాట నమ్మవే ఓ మైనా
నిన్ను విడిచుండలేనింక ఏమైనా
ఆమె:
పులకింత పూవానా చిలికింత నీతోనే - ముడివేసుకుంటాను ఈ పైన
నీకు ఇస్తాను అడిగింది ఏదైనా అంటూ
ఎదకుపంటిలో వెన్నెల రాజేసి కోరికతో వయసు ఉడికిపోతుంటే
||కూనలమ్మ||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »