|
Context
Song Context:
చిలిపి ఊహ వెనుక తరుముతుంటే - ఆకాశ వీధి స్వాగతించెనే!
వలపు యాత్ర సాగిపోతువుంటే - మేఘాలవాడ విడిది చూపెలే! |
Song Lyrics
||ప||అతడు|
ప్రియ వసంత గీతమా
ఆమె:
వనమయూర నాట్యమా
అతడు:
కుహుకుహూల రాగమా
ఆమె:
మృదుస్వరాల నాదమా
అతడు:
అరవిందాలయన పంచుకున్న శాంతమా
ఆమె:
పెదవులు మూగబాసలెరిగిన ఏకాంతమా
అతడు:
అందుతున్న అందమా పొందికైన బంధమా
ఆమె:
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
||ప్రియ||
.
చరణం: అతడు:
చిలిపి ఊహ వెనుక తరుముతుంటే - ఆకాశ వీధి స్వాగతించెనే
ఆమె:
వలపు యాత్ర సాగిపోతువుంటే - మేఘాలవాడ విడిది చూపెలే
అతడు:
సుదూర స్వప్నసీమ సమీపమే సుమా
ఆమె:
జపించి జంట ప్రేమ జయించి చేరుమా
అతడు: పరవశమా ఆమె:పరుగిడుమా
అతడు:
అరవిందాలయన పంచుకున్న శాంతమా
ఆమె:
పెదవులు మూగబాసలెరిగిన ఏకాంతమా
అతడు:
అందుతున్న అందమా పొందికైన బంధమా
ఆమె:
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
||ప్రియ||
.
చరణం: ఆమె:
ఉక్కబోసే వేళలో ఊటి చలో చలో
అతడు:
ఎండకౌగిలి చేరినా అమ్మో అదేం చలో
ఆమె:
ఇలాంటి హాయి నాకు ఇంతవరకు లేదుగా
అతడు:
ఈ వేళ అందులోన వింత చూడు కొత్తగా
ఆమె:
చేయిచాచి చేరదీసి చూపవమ్మా
అతడు:
శుభతరుణాలలోన చేరుకున్న చైత్రమా
||ప్రియ||
.
.
(Contributed by Prabha) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »