Posted by admin on 3rd September 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song! |
Song Lyrics
||ప| |అతడు|
ఓసోసి పిల్లా అంతేసి కళ్ళా అందాల సంకెళ్ళా అందాల సంకెళ్ళా
నిలువెల్లా అల్లేసి ఇల్లా నిలేసి ఆపేలా నిషాల చూపేలా
ఆమె:
ఎన్నాళ్ళకిల్లా చిక్కావుమల్లా కిలాడి గోపాలా కిలాడి గోపాలా
మురిపెంగా ఒళ్ళోకి వాలా ముద్దాడుకోవేలా ముడేసుకోవేలా
అతడు:
వయ్యారాలే వలేసి కట్టేశావే మెలేసి కదల్లేనే ఎటేపైనా వెళ్ళాలన్నా
ఆమె:
సరదా తీరిపోయేలా జతగా చేరి పొద్దల్లా చెలరేగాలి ఇంకా ఊహల ఉయ్యాలా
అతడు:
గాల్లో తేలి ఈ వేళ ఉరికే జంట జంపాల చూడదు కాస్త కూడ ఏ వేళాపాళా
|| ఓసోసి పిల్లా ||
.
||చ|| అతడు:
నడిచేవేళ నడుము ఊపాలా నరాలు తెంచేలా
ఆ లయల్లో ఆ హొయల్లో మనసులిక్కిపడేట్టు షికారు చెయ్యాలా
ఆమె:
నిను ఊరించేలా ఊగే సోకుల ఉడుకే దించేలా
మతిచెడేలా జతపడేలా ఏం చెయ్యాలో అనేది తెగేసి చెప్పాలా
అతడు:
ఉసిగొట్టిచంపకే బాలా సొగసటో ఇటో అయ్యేలా
ఆమె:
రసపట్టు చూడనీవేల? తగు మగవాడివనిపించేలా
అతడు:
కవ్వించే కైపుగోల ఆపవే జవరాలా
ఆమె:
కథపెంచే లౌలీ లీల ఆపకు పనిమాలా
|| ఓసోసి పిల్లా ||
.
||చ|| ఆమె:
జంటగ వెళ్ళి వెంటాడాలి సుఖాలనీవేళ
ఈ చలాకి జత ఖుషీకి యవ్వనాల వనాలు వసంతమాడేలా
అతడు:
తుంటరి గాలి కొంటెగ వాలి తడిమిందే లైలా
ఆ చురుక్కి నీ కులుక్కి కెవ్వనేలా కులాసా కుహూలు పుట్టేలా
ఆమె:
అవకాశమందుకో నానీ యమ తమాషాలు చూస్తావే
అతడు:
నా తుఫానంటి వేగాన్ని నువు తమాయించుకోలేవే
ఆమె:
ఉస్కో అంటాను గానీ నాతో వస్తావా
అతడు:
చూస్కో అయితే సరే నా సత్తా చూస్తావా
|| ఓసోసి పిల్లా ||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »