|
Context
Song Context:
పంచప్రాణాలు నీ పేరుగా పెంచుకున్నాను నిను చేరగా!
తెలుసులే నాకు ఓ ప్రేమికా సులువుగా తెంచుకోలేనుగా! |
Song Lyrics
||ప||అతడు|
రా చిలకా! రా చిలకా! ఎగిరావ చేతికందక
ఆమె:
లాలనగా రమ్మనగా దిగిరాన చెంతవాలగ
అతడు:
మన చెలిమికి వెయ్యేళ్ళుగా నిలబడు నువు చేయూతగా
ఆమె:
అనుబంధాలుగా నను బంధించగా నిను ఆపింది నే కాదుగా
అతడు:
పంచప్రాణాలు నీ పేరుగా పెంచుకున్నాను నిను చేరగా
ఆమె:
తెలుసులే నాకు ఓ ప్రేమికా సులువుగా తెంచుకోలేనుగా
|| రా చిలకా ||
.
||చ|| అతడు:
కాస్త కొత్త కదా నను నడిపే ప్రేమకథ చెప్పదుగా చిక్కుల్లో ఏ తోవ
ఆమె:
దానికంత ఇదా మనసుంటే చాలు కదా అనుకుంటే మార్గం లేదంటావా
అతడు:
మొన్నేమరి మనసిమ్మంటూ పుచ్చేసుకున్నావుగా
మతేచెడి మిగిలున్నాను ఏం తోచక
ఆమె:
అదే మరి నా గుండెల్లో దాచాను జాగర్తగా
మళ్ళా అది మన కౌగిళ్ళకే అందించగా
అతడు:
పంచప్రాణాలు నీ పేరుగా పెంచుకున్నాను నిను చేరగా
ఆమె:
తెలుసులే నాకు ఓ ప్రేమికా సులువుగా తెంచుకోలేనుగా
|| రా చిలకా ||
.
||చ|| ఆమె:
నిన్న కలలన్నీ మన రేపటి వెలుగులని నమ్మించే సూరీడల్లే రావా
అతడు:
నిను కలుసుకుని నను నేనే గెలుచుకుని చూపిస్తా నాలో ఉన్న చేవ
ఆమె:
నువ్వే నెగ్గి ఈ దూరాన్ని తగ్గించు మహరాజుగా
నేనే ఓడి ఒదిగుంటాను నీదానిగా
అతడు:
సరే మరి సుడిగాలల్లే వస్తాను నిన్నల్లగా
రెడీ చెలీ ఒడిలో చేరు నా రాణిగా
అతడు:
పంచప్రాణాలు నీ పేరుగా పెంచుకున్నాను నిను చేరగా
ఆమె:
తెలుసులే నాకు ఓ ప్రేమికా సులువుగా తెంచుకోలేనుగా
|| రా చిలకా ||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »