Posted by admin on 24th September 2010 in
ప్రేమ
|
Context
Song Context:
A love song |
Song Lyrics
||ప|| |అతడు|
దాయి దాయి దయచేయి జాబిలి
ఆమె:
హాయి హాయి హాయి అననీ ఈ కౌగిలి
అతడు:
అసలే ఇరుకైపోయిన జతలో వాలి
ఆమె:
హరిలో హైలెస్సా అని చలిజావళి
అతడు:
తమకాలు తీరాలి పైనా లోనా
||దాయి దాయి||
.
చరణం: అతడు:
ఎర్ర ఎర్రని చెక్కిళ్ళు కొరుక్కునే గోరంత ఆశ
ఆమె:
వెర్రెక్కిన ఎక్కిళ్ళు వెతుక్కునే తీరంత చూశా
అతడు:
పోన్లే అని అరా కొరా పంచిస్తే పెనవేసుకోనా
ఆమె:
చిన్నోడికి అదీ ఇదీ తెలిసిందే ఇన్నాళ్ళకైనా
అతడు:
సరదాగ మొదలెడదాం
ఆమె:
చెలరేగి తలపడదాం
అతడు:
పగలైనా రేయైనా రానా మైనా
||దాయి దాయి||
.
చరణం: ఆమె:
సిగ్గులకే సిగ్గేసి చెకా చెకా ఏ వంకో పోయే
అతడు:
చక్కిలిగిలి చిందేసి తికామకా వీరంగమాయే
ఆమె:
ఎన్నాళ్ళని ఉసూరనే ఆవిర్లు చల్లారిపోనీ
అతడు:
పన్లోపని ఇవాళతో సంకెళ్ళు తెంచేసుకోనీ
ఆమె:
ఒడిచేరి సుఖపడనా
అతడు:
ఒకసారి సరిపడునా
ఆమె:
జతకోరి కలబడినా ఎండా వానా
||దాయి దాయి||
.
.
(Contributed by Phanindra KSM) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »