| 
 | 
 Context 
Song Context: 
   This must be that! It just feels like it   
   (ఇది అదేనేమో అలాగే ఉందే)  | 
| 
 Song Lyrics 
పల్లవి: |అతడు| 
       ఇది అదేనేమో అలాగే ఉందే 
       తెలుసునో లేదో తెలీడం లేదే 
       ఫలనా అని అనుకోమని 
       ఏ రోజు చెబుతుందో ఏమో 
|ఆమె| 
       ఇది అదేనేమో అలాగే ఉందే 
       తెలుసునో లేదో తెలీడం లేదే 
       ఫలనా అని అనుకోమని 
       ఏ రోజు చెబుతుందో ఏమో 
|ఆమె| ఇది అదేనేమో 
|అతడు| అలాగే ఉందే 
. 
చరణం 1: |అతడు| 
       మొగవాళ్ళకు కూడ ఇంత మొహమాటముంటుందా 
                                  అనుకోనే లెదే ఏనాడు 
|ఆమె| 
       బిడియానికి కూడ ఇంత దుడుకొచ్చే తుళ్ళింత 
                                  బహుశా నీ వల్లే ఈనాడు 
|అతడు| 
       అవకాశం ఇస్తునా.. అడిగేసే వీలున్నా 
       అనుమానం ఆపింది అనేందుకు 
|ఆమె| 
       కుడి కొంచం ఎడమైనా..మనలో ఏ ఒకరైనా 
                      అనుకుందాం అవునో కాదో 
|అతడు| 
       ఫలనా అని అనుకోమని 
       ఏ రోజు చెబుతుందో ఏమో 
|అతడు| ఇది అదేనేమో 
|ఆమె| అలాగే ఉందే 
. 
చరణం 2: |ఆమె| 
       ఏకాంతం ఎరుపెక్కేలా..అంత ఇదిగా చూడాలా 
       నీతో మాకష్టం మాస్టారు 
|అతడు| 
       చలిగాలికి చెమటట్టెలా..కవ్విస్తూ నవ్వాలా 
       ఉడికిస్తూ ఉందే నీ తీరు 
|ఆమె| 
       ఇదివర్లా ఉండాలో.. ఇంకోలా మారాలో 
       ఈ తీయని ఇబ్బంది ఇదేవిటో 
|అతడు| 
       దూరంగా ఆగాలో..దగ్గరగా చేరాలో 
       ఏమి చేస్తే బాగుంటుందో 
|ఆమె| 
       ఫలనా అని అనుకోమని 
       ఏ రోజు చెబుతుందో ఏమో 
|ఆమె| ఇది అదేనేమో 
|అతడు| అలాగే ఉందే 
. 
. 
                    (Contributed by Sai)  | 
| 
 Highlights 
   ఫలనా అని, అనుకోమని, ఏ రోజు చెబుతుందో ఏమో! 
………………………………………………………………………………………………..  | 
					
				 
				  No Comments »