Posted on 25th June 2010 @ 12:27 AM in
మహిళలు
|
Context
Song Context:
మహిళలు!
|
Song Lyrics
||ప|| |అతడు|
మహిళలు మహరాణులు ||2||
పచ్చనైన ప్రతి కథకు తల్లి వేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గి రవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు
||మహిళలు||
.
చరణం:
ఆశ పుడితే తీరు దాకా ఆగరు ఎలనాగలు
సహనానికి నేల తల్ల్లిని పోలగలరు పొలతులు
అమ్మగా లొకానికే ఆయువిచ్చు తల్లులు
అత్తగా అవతరిస్తె వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో అడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు
||మహిళలు||
.
చరణం:
విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు
ఒడ్డు దాటే ఉప్పెనల్లే ముప్పు కాదా ముదితలు
పెద్దలను మన్నించే పద్ధతే ఒద్దంటే
మానమూ మర్యాద ఆగునా ఆ ఇంటా
కన్నులను కరుణకొద్దీ కాపడే రెప్పలే
కత్తులై పొడిచేస్తే ఆపేదింకెవరులే
వంగి ఉన్న కొమ్మలే బంగారు బొమ్మలూ
||మహిళలు||
.
.
(Contributed by Prabha) |
Highlights
…………………………………………………………………………………………………
|
|
No Comments »