| 
 | 
 Context 
Song Context:  
    ప్రకృతి - కాంత!  | 
| 
 Song Lyrics 
||ప|| |అతడు| 
       ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో 
       పదము కదిపితే ఎన్నెన్ని లయలో || ప్రకృతి || 
       ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో ||2|| 
. 
|అతడు| 
       సిరివెన్నెల నిండిన ఎదపై 
       సిరిమువ్వల సవ్వడి నీవై 
       నర్తించగ రావేలా - నినునే 
       కీర్తించే వేళ || ప్రకృతి || 
. 
||చ|| 
       అలల పెదవులతో శిలల చెక్కిలిపై 
       కడలి ముద్దిడు వేళా పుడమి హృదయంలో || అలల || 
       ఉప్పొంగి సాగింది అనురాగము 
       ఉప్పెనగ దూకింది ఈ రాగము 
                                || ప్రకృతి || 
. 
||చ|| 
       కొండల బండల దారులలో 
       తిరిగేటి సెలయేటి గుండెలలో || కొండల || 
       రారా రారమ్మని పిలిచిన 
       కోన పిలుపు వినిపించగనే || రారా || 
       కోకొత్త వలపు వికసించగనే 
       ఎన్నెన్ని హొయలో ఎన్నెన్ని లయలో 
                                || ప్రకృతి || 
. 
. 
                      (Contributed by Nagarjuna)  | 
| 
 Highlights 
A Sirivennela Classic! 
. 
[Also refer to Pages 26 & 30 - 33 in సిరివెన్నెల తరంగాలు] 
………………………………………………………………………………………………..  | 
					
				 
				  1 Comment »