Search Results

సొగసు చూడతరమా: సీతకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా

Audio Song:
 
Movie Name
   Sogasu Chudatarama
Song Singers
   Anuradha Sriram
Music Director
   Ramani Prasad
Year Released
   1995
Actors
   Naresh,
   Indraja
Director
   Guna Sekhar
Producer
   K. Ram Gopal

Context

Song Context:
   అమ్మ పొందేటి ఆనందమేదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ!

Song Lyrics

పల్లవి:
       సీతకోకచిలకాలమ్మా లేలేత చిగురాకులమ్మా
       పారాడు పాపాయిలమ్మా పొంగి పారేటి సెలయేరులమ్మా
       పొత్తిళ్ళలో చిట్టి పుత్తడిబొమ్మను పొదువుకున్న ముద్దుగుమ్మ అమ్మ  
       పొందేటి ఆనందమేదో తెలియాలంటే ఎత్తాలి తను ఆడజన్మ బ్రహ్మ
                                         ||సీతాకోక||
.
చరణం:
       కుహుకుహూ కూసే కోయిలా ఏదీ పలకవే ఈ చిన్నారిలా
       మిలమిలా మెరిసే వెన్నెలా ఏదీ నవ్వవే ఈ బుజ్జాయిలా
       అందాల పూదోటకన్నా చిందాడు పసివాడె మిన్న
       బుడత అడుగులే నడిచేటి వేళలో
       పుడమితల్లికెన్ని పులకలో
                                           ||సీతాకోక||
.
చరణం:
       గలగలా వీచే గాలిలా సాగే పసితనం తీయని ఒక వరం
       ఎదిగిన ఎదలో ఎప్పుడూ నిధిలా దాచుకో ఈ చిరు జ్ఞాపకం
       చిరునవ్వుతో చెయ్యి నేస్తం చీమంత అయిపోదా కష్టం
       పరుగు ఆపునా పడిపోయి లేచినా
       అలుపుసొలుపు లేని ఏ అలా
                                             ||సీతకోక||
.
.
                          (Contributed by Prabha)

Highlights

Follow the complete lyrics! Wow!
.
[Also refer to Page 250 in సిరివెన్నెల తరంగాలు]
………………………………………………………………………………………………..