|
Context
Song Context:
భారతీయ స్త్రీ [Indian Woman]
(మగువను మన్నించి మనసున కొలువుంచు, పురుషుడె మనిషంటూ జగతికి చాటించి, మురిసిన చరితని తలుచుకొని)
|
Song Lyrics
||ప|| |అతడు|
వినిపించనీ తరుణీ నీ చరితని
వివరించనీ రమణీ నీ ఘనతని
ప్రకృతిగ భావించి పడతిని పూజించు
సంస్కృతి మనదేనని
|| వినిపించనీ ||
.
||చ|| |అతడు|
మంచికి మాగాణి మమతల మారాణి
భరతావని భామిని ఇలపై సౌదామిని
కుంకుమ నీరెండ కురులలో పూదండ
కళలొలికే భూమిని ప్రతి ఋతువు ఆమని
మగువను మన్నించి మనసున కొలువుంచు
పురుషుడె మనిషంటూ జగతికి చాటించి
మురిసిన చరితని తలుచుకొని
|| వినిపించనీ ||
.
||చ|| |అతడు|
అమ్మ అనడమే అన్ని విద్యలకూ ఆది బిందువంది
పుట్టుకకే పురుడోసిన పృధివిని స్త్రీతో పోల్చింది
ఇల్లాలిని నట్టింటి లక్ష్మిగా కళ్ళకద్దుకుంది
ఇంటి కంటితడి కారు చిచ్చులా కాల్చుతుంది అంది
ఇలాంటి ధర్మం ఈ జగాన ఇంకెక్కడ ఉంటుంది
.
||చ|| |అతడు|
శృంగార రంగాన అంగన సౌందర్యలహరి
చందన శీతల మందహాస చంద్రికలలాసనగరి
కారుణ్యామృతవారి సుకుమారి
సమరాంగణాన యమపురికి దారి చూపించు వీరనారి
సహన శీలమున శాంత శీలమై నిలిచే చిన్నారి
మహిష మర్దినిగ భయద భీభత్స జ్వాలా కీలగ మారి
భద్రకాళిగా రౌద్రకేళిగా రుధిర నదులుగ పారి
పరమాద్భుతమనిపించదా మరి
నవరసాకృతుల కలికి విలాసం దర్శించిన భారతదేశం
మనవ జాతికి సందేశం తరతరాలకు ఆదర్శం
.
.
(Contributed by Pradeep) |
Highlights
There you go. If we have to answer about భారతీయ స్త్రీ,
Sirivennela gaaru made our life easy. You are ready now 
.
Observe this line:
మగువను మన్నించి మనసున కొలువుంచు,
పురుషుడె మనిషంటూ జగతికి చాటించి, మురిసిన చరితని తలుచుకొని.
What is the subject in this line?
Is it మగువ, పురుషుడె, చరిత or all of them?! Brilliantly packaged!
.
ప్రకృతిగ భావించి పడతిని పూజించు సంస్కృతి మనదేనని
.
అమ్మ అనడమే అన్ని విద్యలకూ ఆది బిందువంది
పుట్టుకకే పురుడోసిన పృధివిని స్త్రీతో పోల్చింది
ఇల్లాలిని నట్టింటి లక్ష్మిగా కళ్ళకద్దుకుంది
ఇంటి కంటితడి కారు చిచ్చులా కాల్చుతుంది అంది
ఇలాంటి ధర్మం ఈ జగాన ఇంకెక్కడ ఉంటుంది?
.
నవరసాకృతుల కలికి విలాసం దర్శించిన భారతదేశం
మనవ జాతికి సందేశం తరతరాలకు ఆదర్శం!
……………………………………………………………………………………………….. |
|
No Comments »