|
Context
Song Context:
ప్రకృతి గీసే చిత్రం కాదా చక్కని మా ఊరు!
పరులెవరైనా ఎపుడైనా ఇటు వస్తే చాలమ్మా
మళ్లీ వెనుదిరిగి పొమ్మన్నా పోరమ్మా
ఇంత కంటే స్వర్గం ఉంటుందా అనుకుంటారమ్మా! |
Song Lyrics
||ప|| |ఆమె|
ఆకుపచ్చని సిరి అందాలు - రేకు విచ్చిన అరవిందాలు
ఆది లక్ష్మికి ఆభరణాలమ్మా
ఆదరించే అభిమానాలు - ఆశ పెంచే అనుబంధాలు
ఆది నుంచి పల్లెల చిరునామా
ఎవరైనా ఎపుడైనా ఇటు వస్తే చాలమ్మా
మళ్లీ వెనుదిరిగి పొమ్మన్నా పోరమ్మా
ఇంత కంటే స్వర్గం ఉంటుందా అనుకుంటారమ్మా
||ఆకుపచ్చని||
.
చరణం:
సూర్యుడి రథచక్రంలో సవ్వడి వినిపిస్తుంది
తొలి పొద్దుల్లో కిలకిలలాడే గువ్వల సడి వింటే
దేవుడు మనకందించే దీవెన కనిపిస్తుంది
నడిరాతిరిలో మిలమిలలాడే వెన్నెల చూస్తుంటే
కలలను పూసే నేత్రం కాదా కదలని ఈ కోనేరు
కథకళి చేసే పాదం కాదా పరుగులు తీసే ఏరు
ప్రకృతి గీసే చిత్రం కాదా చక్కని మా ఊరు
పరులెవరైనా ఎపుడైనా ఇటు వస్తే చాలమ్మా
మళ్లీ వెనుదిరిగి పొమ్మన్నా పోరమ్మా
ఇంత కంటే స్వర్గం ఉంటుందా అనుకుంటారమ్మా
||ఆకుపచ్చని||
.
చరణం:
ఎవరింట్లో పెళ్లైనా అందరి గుండెల్లోనా
సందడి పుట్టి పందిరి కట్టి పండుగ చేస్తుంది
ఎవ్వరి కన్నీళ్లైనా అందరి కన్నుల్లోనా
వరదై పొంగి ఊరూరంతా ఒకటై వస్తుంది
ఎవరికి వారే యమునా తీరే అనుకోరిక్కడ ఎవరూ
వరసలు కట్టి పిలుచుకునేందుకు బంధువులే ప్రతి ఒకరు
పదుగురు కలిసి ఒకటై బతికే మా తీరే వేరు
పరులెవరైనా ఎపుడైనా ఇటు వస్తే చాలమ్మా
మళ్లీ వెనుదిరిగి పొమ్మన్నా పోరమ్మా
ఇంత కంటే స్వర్గం ఉంటుందా అనుకుంటారమ్మా
||ఆకుపచ్చని||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
………………………………………………………………………………………………..
|
No Comments »