|
Context
Song Context:
తన ఒడిలో పొదువుకునీ భద్రంగా నడిపే నౌక,
తననొదిలి వెళ్లకనీ ఏ బంధాన్నీ కోరదుగా! |
Song Lyrics
||ప|| |అతడు|
ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వూ
నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వూ
చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం
చెలిమి వెంట సాగలేక శిల అయిందే నా ప్రాణం
గతమే మరిచీ బ్రతకాలే మనసా
||ఓ మనసా ||
.
||చ|| |అతడు|
ఎగసిపడే అల కోసం దిగివస్తుందా ఆకాశం
తపన పడి ఏం లాభం అందని జాబిలి జత కోసం
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
కలిసిరాని ప్రేమ తీరం తీరిపోయిన రుణమనుకో
మిగిలే స్మృతులే మనవనుకో మనసా..
||ఓ మనసా ||
.
||చ|| |అతడు|
తన ఒడిలో పొదువుకునీ భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్లకనీ ఏ బంధాన్నీ కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటూ ఏ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలనే తరిమే ఓ మనసా..మనసా..మనసా
||ఓ మనసా ||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
కలిసి ఉన్న కొంతకాలం వెనక జన్మ వరమనుకో
.
తన ఒడిలో పొదువుకునీ భద్రంగా నడిపే నౌక
తననొదిలి వెళ్లకనీ ఏ బంధాన్నీ కోరదుగా
కడలిలోనే ఆగుతుందా కదలనంటూ ఏ పయనం
వెలుగు వైపు చూడనందా నిదర లేచే నా నయనం
కరిగే కలవే తరిమే ఓ మనసా..మనసా..మనసా
……………………………………………………………………………………………….. |
|
No Comments »