Search Results

ప్రియరాగాలు: చిన్నా! చిరుచిరునవ్వుల చిన్నా!

Audio Song (Mom):
Audio Song (Dad):
 
Movie Name
   Priya Ragalu
Song (Mom) Singers
   Chitra
Song (Dad) Singers
   Balu
Music Director
   M.M. Keeravani
Year Released
   1997
Actors
   Jagapathi Babu,
   Soundarya,
   Maheswari
Director
   Kondandarami Reddy
Producer
   Sunkara Madhu Murali

Song (Mom) Lyrics

Context:
   నా ప్రేమ పోతపోసి కన్నానురా
             నిను శ్రీరామరక్షలాగ కాపాడగా
                             నీలో ఉన్నా నీతో ఉన్నా!
.
పల్లవి:
       చిన్నా! చిరుచిరునవ్వుల చిన్నా!
       కన్నా! చిట్టిపొట్టిచిందులు కన్నా!
       నా ప్రేమ పోతపోసి కన్నానురా
       నిను శ్రీరామరక్షలాగ కాపాడగా
       నీలో ఉన్నా నీతో ఉన్నా
                            ||చిన్నా||
.
చరణం:
       అటు చూడు అందాల రామచిలకని
       చూస్తోంది నిన్నేదొ అడుగుదామని - నీ పలుకు తనకి నేర్పవా అని
       ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని
       పడుతోంది లేస్తోంది ఎందుకో మరి - నీలాగ పరుగు చూపుదామని
       కరిగిపోని నా తీపికలలని
       తిరిగిరాని నా చిన్నతనముని - నీ రూపంలో చూస్తూ ఉన్నా
                                  ||చిన్నా||
.
చరణం:
       తూనీగ నీలాగ ఎగరలేదురా
       ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా - ఈ పరుగులింక ఎంతసేపురా
       ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
       నా గారాల మారాజ కాస్త ఆగరా - నీ వెంట నేను సాగలేనురా
       ఎంత వెదికినా దొరకనంతగా
       ఎంత పిలిచినా పలకనంతగా - వెళిపోకమ్మా రారా కన్నా
                                   ||చిన్నా||
.
.
                            (Contributed by Prabha)

Song (Dad) Lyrics

Context:
   నాతోనె దోబూచులాడాలనా
           ఆ ఆటల్లొ నీకు నేను ఓడాలనా
                  చూశా కన్నా చూశా కన్నా చిన్నా

.
పల్లవి:
       చిన్నా! చిరుచిరునవ్వుల చిన్నా!
       కన్నా! చిట్టిపొట్టిచిందులు కన్నా!
       నాతోనె దోబూచులాడాలనా
       ఆ ఆటల్లొ నీకు నేను ఓడాలనా
       చూశా కన్నా చూశా కన్నా చిన్నా
.
చరణం:
       అటు చూడు అందాల రామచిలకని
       చూస్తోంది నిన్నేదొ అడుగుదామని - నీ పలుకు తనకి నేర్పవా అని
       ఇటు చూడు చిన్నారి లేడి పిల్లని
       పడుతోంది లేస్తోంది ఎందుకో మరి - నీలాగ పరుగు చూపుదామని
       కరిగిపోని నా తీపికలలని
       తిరిగిరాని నా చిన్నతనముని - నీ రూపంలో చూస్తూ ఉన్నా
                              ||చిన్నా||
.
చరణం:
       తూనీగ నీలాగ ఎగరలేదురా
       ఆ తువ్వాయి నీలాగ గెంతలేదురా - ఈ పరుగులింక ఎంతసేపురా
       ఈ ఆట ఈ పూట ఇంక చాలురా
       నా గారాల మారాజ కాస్త ఆగరా - నీ వెంట నేను సాగలేనురా
       ఎంత వెదికినా దొరకనంతగా
       ఎంత పిలిచినా పలకనంతగా - వెళిపోకమ్మా రారా కన్నా
                             ||చిన్నా||

.
.
                             (Contributed by Prabha)

Highlights (Both)

Yet another double header masterpiece - the same చరణాలు with different పల్లవులు !
.
I changed the formatting of the page to accommodate both the versions in the same screen shot.
.
Enjoy the complete lyrics!
.

[Also refer to Page 255 in సిరివెన్నెల తరంగాలు]
…………………………………………………………………………………………………