|
Context
Song Context:
(నా మనసుని)నిందించాలా? (నేను)ఆనందించాలా?
నిన్నడగాలనుకుంటున్నా!!!
అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా! |
Song Lyrics
పల్లవి:
అందర్లాగా నేనూ అంతే అనుకోవాలా
తొందర పెట్టే తోవల వెంటే వెళ్ళిపోవాలా
అనుకోనిదైనా ఆలోచన
బాగుంది అననా ఈ భావన
నిన్నడగాలనుకుంటున్నా
నిందించాలా ఆనందించాలా
.
చరణం 1:
నో నో అటు పోవద్దు మనసా ఏంటా మత్తు
అన్నా ముందే ఎన్నో చెప్పి
ఏదో సరదా లెద్దూ వేరే ఏమీ లేదు
తప్పా అంది కట్టు తప్పి
వీలైతే కాసిని కబుర్లు కుదిరితే కప్పు కాఫీ
అంటూనే చేజారింది ఇట్టే కన్ను కప్పి
మాట మాట కలిపి అటు పైన మాయగొలపి
ఎంత హాయి అందే ఈ తీయనైన నొప్పి
నిన్నడగాలనుకుంటున్నా
నిందించాలా ఆనందించాలా
.
చరణం 2:
తానే నమ్మేటట్టు తనపై తానే ఒట్టు
వేస్తూ అందించింది హామీ
పోన్లే పాపం అంటూ త్వరగా వచ్చెయ్యంటూ
చూస్తూ పంపించాను మదిని
గూడంతా ఖాళీ చేస్తూ వెళిపోయిన గువ్వల్లా
నా కన్నుల్లో కలలన్నీ నీ వల్లో చిక్కాలా
ఎవరి నేరమంటూ నిష్టూరమెందుకంటే
కలిసి ఒప్పుకుంటే అది కూడా మంచిమాటే
నిన్నడగాలనుకుంటున్నా
నిందించాలా ఆనందించాలా
.
.
(Contributed by Vijaya Saradhi) |
Highlights
Looks like already became the most popular song!
……………………………………………………………………………………………….. |
2 Comments »