Search Results

మిరపకాయ: గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో మహానుభావా

 

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Mirapakaaya
Song Singers
   Karthik,
   Geetha Madhuri
Music Director
   Thaman S.
Year Released
   2010
Actors
   Ravi Teja,
   Richa Gangopadhyay,
   Deeksha Seth
Director
   Harish Shankar
Producer
   Ramesh Pushpala

Context

Song Context:
    చెప్పకుండా విని చెంతకొస్తావని - గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని!

Song Lyrics

||ప|| ఆమె:
       గది తలుపుల గడియలు బిగిసెను చూసుకో మహానుభావా
       అది తెలిసిన బిడియము జడిసెను ఎందుకో…
అతడు:
       తలమునకల తలపుల అలజడి దేనికో గ్రహించలేవా
       అరమరికల తెర విడు అలికిడి పోల్చుకో…తేల్చుకో…
ఆమె:
       ఉడికే ఈడుతో పడలేకున్నా
       దయతో నన్నాదుకో దరికొస్తున్నా
       మరిగే ఈ కోరికే వివరిస్తున్నా
       నిన్ను తాకే గాలితో వినిపిస్తున్నా
అతడు:
       రమణి…రహస్య యాతన చూశా
       తగు సహాయమై వచ్చేశా
       కనుక…అదరక బెదరక నా జంటే కోరుకో చేరుకో..
                     |ఆమె| ||ఉడికే ఈడుతో ||
అతడు:
       నువ్వెంత అవస్థ పడుతున్నా
       అదంత సమస్య కాదన్నా
       చిలకరో…చిటికెలో తపన తగ్గించి పోలేనా
.
||చ|| ఆమె:
       ఆశ గిల్లిందని…ధ్యాస మళ్లిందని
       ఇంత గల్లంతు నీ వల్లనే లెమ్మని
       వచ్చి నిందించనీ…తెచ్చి అందించనీ
       ఓర్చుకోలేని ఆపసోపాలని…||2||
అతడు:
       పడతి ప్రయాస గమనిస్తున్నా
       నే తయారుగానే ఉన్నా
       సొగసు విరివిగ విరిసిన ప్రియ భారం దించుకో..పంచుకో
ఆమె:
       ఇదిగో తీసుకో…ఎదరే ఉన్నా
       నిధులన్నీ దోచుకో…ఎవరేమన్నా
.
||చ|| ఆమె:
       అగ్గి రవ్వంటి నీ దగ్గరవ్వాలని
       కెవ్వుమంటూ ఎటో సిగ్గు పోవాలని
       చెప్పకుండా విని చెంతకొస్తావని
       గుండె చెప్పిందిలే గుర్తుపట్టావని||2||
అతడు:
       తెలిసి మరెందుకీ ఆలస్యం
       తక్షణం తథాస్తనుకుందాం
       నివురు వదిలిన నిప్పులు నిలువెల్లా మోజుతో రాజుకో
ఆమె:
       ఉరికే ఊహలో విహరిస్తున్నా
       మతిపోయే మాయలో మునకేస్తున్నా
                  |అతడు| ||నువ్వెంత అవస్థ||
.
.
            (Contributed by Nagarjuna)

Highlights

………………………………………………………………………………………………..