Search Results

నరసింహుడు: ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాకా

Posted by admin on 22nd May 2009 in ప్రేమ

Audio Song:
 
Movie Name
   Narasimhudu
Singers
   Mallikarjun, Ganga
Music Director
   Mani Sharma
Year Released
   2005
Actors
   Jr. NTR, Sameera Reddy
Director
   B. Gopal
Producer
   Chengala Venkat Rao

Context

Song Context: ఓ యుగళ గీతం

Song Lyrics

||ప|| |ఆమె|
       ఏలుకో నాయకా రాసి ఇచ్చా నా ఇలాకా
|అతడు|
       ఏలకో బాలికా దూసుకొచ్చావే ఇలాగా
|ఆమె|
       ఎన్నాళ్లు దాస్తా ఇంకా ఎండ కన్నైన పడనీక
|అతడు|
       ధన్యోస్మి అంటా చిలకా అందుకున్నాక అందాల నీ కానుక
                                     || ఏలుకో నాయకా ||
.
||చ|| |ఆమె|
       అర్థం చేసుకో మగరాయా అంతా చెప్పకున్నా
|అతడు|
       ఇంకా చాటుగా మిగిలాయా కనులు చెదిరే కాంచనా
|ఆమె|
       వివరించే వీలు ఉందా వేధించే వయసు యాతన
|అతడు|
       కలహించే వీలు కోరిందా కసిరే కైపు కామన
|ఆమె|
       నొప్పంటు భయపడతానా తీపి గాయాలు చేస్తున్నా
|అతడు|
       నిప్పంటి నా సరసాన ఆపసోపాల తాపాలు చల్లార్చనా
                                  || ఏలుకో నాయకా ||
.
||చ|| |అతడు|
       ఇదేం కోరికే కుర్రదానా కొంపే మునిగిపోదా
|ఆమె|
       నిదానించమంటున్నానా కదిలిరావేం మన్మథా
|అతడు|
       సుకుమారం సోలిపోదా కవ్వించే కయ్యమాపగా
|ఆమె|
       సఖి భారం పంచుకోరాదా చేదా చెలియ సంపదా
|అతడు|
       వద్దొద్దు అంటానంటే నిధులిస్తుంటే నీ జంట
|ఆమె|
       సయ్యంటే చెయ్యందిస్తే రకరకాల సుఖాలు నీవే కదా
                                || ఏలుకో నాయకా ||
.
.
                         (Contributed by Nagarjuna)

Highlights

…………………………………………………………………………………………..