Search Results

సింహాద్రి: అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే

Audio Song:
 
Video Song:
 
Movie Name
   Simhadri
Song Singers
   Kalyan Malik
Music Director
   M.M. Keeravani
Year Released
   2003
Actors
   Jr. NTR,
   Bhoomika Chawla
Director
   S.S. Raja Mouli
Producer
   V. Vijay Kumar Varma

Context

Song Context:
He is answering her (who lost memory in a freakish accident supposedly caused by him and hence she is a child mentally; and also lost her parents in the same accident and currently brought up by him) why she doesn’t have parents?

Song Lyrics

||ప|| |అతడు|
       అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే
       పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా
       చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా
       సయ్యాట సాగేనా ఎగసే కెరటానా
       అమ్మానాన్న ఉంటే అమ్మో మహ ఇబ్బందే
       కాస్తైనా అల్లరి చేసే వీల్లేదే
                        || అమ్మైనా నాన్నైనా ||
.
||చ|| |అతడు|
       సూరిడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే
       పగలైనా వెలుతురు వస్తుందా
       జాబిల్లికి అమ్ముంటే ఒళ్లో జో కొడుతుంటే
       రాతిరేళ వెన్నెల కాస్తుందా
       నిను చేరేనా నా లాలనా
       ఏనాటికైనా ఓ పసి కూన
       ఆడిందే ఆటంట పాడిందే పాటంట
       ఆపేందుకు అమ్మా నాన్న లేరంట
       సరదాగా రోజంతా తిరిగేనా ఊరంతా
       ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా
       అలుపంటు లేకుండా చెలరేగి ఉరికేనా
       ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్నా
.
||చ|| |అతడు|
       అలిగిందా రాచిలక కూర్చుందా కిమ్మనక
       నాతో మాటాడేదెవరింకా
       రానందా నా వంక దాగుందా కొమ్మెనక
       అమ్మో మరి నాకేం దారింకా
       ఏది ఏది రానిరానీ నన్నేరుకోనీ ముత్యాలన్ని
       ఈ నవ్వే చాలంట పులకించే నేలంతా
       పున్నాగ పువ్వుల తోటై ఏలంట
|అతడు|
       దిక్కుల్నే దాటాలి చుక్కల్నే తాకాలి
       ఆనందం అంచులు నేడే చూడాలి
.
.
                 (Contributed by Nagarjuna)

Highlights

Follow Sirivennela gari conceptualization of how to convince her the advantages of not having parents!
.
Well, it is the subtle distinction between how much freedom to give your kids and how much control to have on them!
       సూరిడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే పగలైనా వెలుతురు వస్తుందా!
       జాబిల్లికి అమ్ముంటే ఒళ్లో జో కొడుతుంటే రాతిరేళ వెన్నెల కాస్తుందా!
       చాల్లే అని ఎవరైనా ఆపుంటే ఎపుడైనా సయ్యాట సాగేనా ఎగసే కెరటానా!
       సరదాగా రోజంతా తిరిగేనా ఊరంతా ఊరేగే చిరుగాలికి ఉండుంటే అమ్మా!
       అలుపంటు లేకుండా చెలరేగి ఉరికేనా ఉప్పొంగే సెలయేటికి ఉండుంటే నాన్నా!
Follow the complete lyrics!
………………………………………………………………………………………………..