Search Results

సింధూరం: అర్ధశతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా

Audio Song:
Video (Explanation by Sirivennela):
Video Song:
Movie Name
Sindhuram
Song Singers
S.P. Balu
Music Director
Sri
Year Released
1997
Actors
Brahmaji,
Ravi Teja,
Sanghavi
Director
Krishna Vamsi
Producer
Krishna Vamsi

Context

Song Context:
తనలో ధైర్యం అడవికి ఇచ్చి,
తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలిచుంటే …
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం!

Song Lyrics

||ప|| |అతడు|
అర్ధశతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా ?
స్వర్ణోత్సవాలు చేద్దామా ?
ఆత్మవినాశపు అరాచకాన్నే స్వరాజ్యమందామా ?
దానికే సలాము చేద్దామా ?
శాంతికపోతపు కుత్తుక తెంచి తెచ్చిన బహుమానం
ఈ రక్తపు సింధూరం!
నీ పాపిటలో భక్తిగ దిద్దిన ప్రజలను చూడమ్మ
ఓ పవిత్ర భారతమా !!
|| అర్ధశతాబ్దపు ||
.
చరణం:
కులాల కోసం గుంపులుకడుతూ మతాల కోసం మంటలు పెడుతూ
ఎక్కడలేని తెగువను చూపి తగువుకు లేస్తారే
జనాలు తలలర్పిస్తారే
సమూహ క్షేమం పట్టని స్వార్ధపు ఇరుకుతనంలో ముడుచుకుపోతూ
మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరేం ?
తెలిసి భుజం కలిపి రారేం ?
అలాటిజనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి ?
పోరి ఏమిటి సాధించాలి ?
ఎవ్వరి కోసం ఎవరు ఎవరితో సాగించే సమరం
ఈ చిచ్చుల సింధూరం
జవాబు చెప్పే భాద్యత మరచిన జనాల భారతమా !
ఓ అనాధ భారతమా !!
|| అర్ధశతాబ్దపు ||
.
చరణం:
అన్యాయాన్ని సహించని శౌర్యం దౌర్జన్యాన్ని దహించే ధైర్యం
కారడవులలో కౄరమృగంలా దాక్కుని ఉండాలా ?
వెలుగుని తప్పుకు తిరగాలా ?
శత్రువుతో పోరాడే సైన్యం శాంతిని కాపాడే కర్తవ్యం
స్వజాతి వీరులనణచే విధిలో కవాతు చెయ్యాలా ? అన్నల చేతిలో చావాలా ?
తనలో ధైర్యం అడవికి ఇచ్చి, తన ధర్మం చట్టానికి ఇచ్చి
ఆ కలహం చూస్తూ సంఘం శిలలా నిలిచుంటే …
నడిచే శవాల సిగలో తురిమిన నెత్తుటి మందారం
ఈ సంధ్యా సింధూరం
వేకువ వైపా, చీకటి లోకా ఎటు నడిపేవమ్మా
గతి తోచని భారతమా !!
|| అర్ధశతాబ్దపు ||
.
చరణం:
తన తలరాతను తనే రాయగల అవకాశాన్నే వదులుకొని
తనలో భీతిని, తన అవినీతిని తన ప్రతినిధులుగ ఎన్నుకొని,
ప్రజాస్వామ్యమని తలచే జాతిని ప్రశ్నించడమే మానుకొని…
కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం !
ఆ హక్కేదో తనకే వుందని శాసిస్తుందట అధికారం !!
కృష్ణుడు లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం !
చితి మంటల సింధూరం!
చూస్తూ ఇంకా నిదురిస్తావా విశాల భారతమా !
ఓ విషాద భారతమా !
.
అర్ధశతాబ్దపు అఙ్ఞానాన్నే స్వతంత్రమందామా ?
స్వర్ణోత్సవాలు చేద్దామా ?
నిత్యం కొట్టుకు చచ్చే జనాల స్వేఛను చూద్దామా?
దానినే స్వరాజ్యమందామా?
.
.
(Contributed by Nagarjuna)

Highlights

1997 Nandi Award Winner!
.
A Sirivennela Classic!
.
Also watch the video on the left with commentary from Sirivennela himself.
.
Shall we call the 50 years of stupidity - the independence and celebrate the golden jubilee?
Shall we call this self-destructive violence – the independence and salute it?
O Bharata Maata, look at these people - obediently decorating in your papita – this blody sindhooram which is the gift by slitting the neck of white pigeon (peace).
Shall we call the 50 years of stupidity - the independence and celebrate the golden jubilee?
Shall we look at this “freedom” of us -everyday killings of each other – Shall we call it the independence?
.
These people show irrational bravery to form as caste groups / religion groups and even sacrifice their lives for them!
When do these people realize the truth - that they are ignoring the collective safety of us with their selfishness which led to make the country burning today? By realizing it why don’t they come together as one?
For such people why should anybody fight? What to achieve by fighting like that?
Who is fighting with whom for whose sake – leading to this violent sindhooram.
This society has forgotten the responsibility to answer these questions and made you an orphan, Bharat Maata.
.
The strength in “us” born out of intolerance to fight against the unfairness and the bravery to fight against the embezzlement – should it hide in the forest like wild animals and from the day light? (We the Naxalites)
The army against the enemy, the responsibility of protecting the peace in “us”– should it waste its energy in controlling our own warriors and in that process getting killed by them? (We the police)
By giving our bravery to the naxalites and the responsibility to the police, does the society (We the people) have to watch the fight between them helplessly then this sindhooram is only to decorate the dead bodies!
Are you, directionless Bharat Maata, going forward or backward?
.
By wasting the golden opportunity of writing our own destiny; and electing the fear & corruption in “us” as leaders/politicians; and living in the myth that it is the democracy, we have forgotten to question our civilization.
Only the irrational anger is leading this blind society with eyes!
The leadership is calling only they have that right to question.
There is no true leader like Krishna in this kurukshetram!
How long are you going to watch it and do nothing – O Bharat Maata?
.
Young Sirivennela questioning pointedly & to shape up!
.
[Also refer to Pages 118-121 in సిరివెన్నెల తరంగాలు & pages 18-21 in "నంది" వర్ధనాలు]
……………………………………………………………………………………………….