|
Context
Song Context:
Get out of the pedestal, you put yourself on!
ఉస్కో అంటూ ఇక ఉడాయించు మరి!
|
Song Lyrics
||ప|| |అతడు|
తిడతారా కొడతారా ఎవరైనా ఎపుడైనా
స్థిరం లేని ఈ శివాలెందుకని నిందిస్తారా బంధిస్తారా
హడావుడిగ పడి లేచే కడలి అలనీ
బలాదూరు తిరిగొచ్చే గాలి తెరనీ
అదే పనిగా పరిగెత్తేవెందుకని
అదిగో అలాగ అదుపే తెలియక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నది హోరు లాగ పలికే పదం ఇది
.
||చ|| |అతడు|
కృష్ణా ముకుందా మురారి నిష్టూరమైన నిజం చెప్పమన్నారే
ఇష్టానుసారంగా పోనీరే సాష్టాంగ పడి భక్తి సంకెళ్లు కడతారే
నీ ఆలయాన గాలి ఐనా ఈల వేసేనా
హే..కేళికైనా లీలకైనా వేళ కుదిరేనా
దేవుడి లాగ ఉంటే ఫ్రీడం అంత సులువా
ఆవారాగా నువ్వు ఆనందించగలవా
ఉస్కో అంటూ ఇక ఉడాయించు మరి
|| అదిగో అలాగ ||
.
||చ|| |అతడు|
శ్రీరాముడంటుంటే అంతా శివతాండవం చేస్తే చెడిపోదా మర్యాద
మతిమరుపు మితిమీరిపోకుండా అతి పొదుపు చూపాలి నవ్వైనా నడకైనా
ఈ ఫ్రేము దాటి పైకి వస్తే లోకువైపోవా
నీ పరువు నీదా పదవి నీదా ప్రజలదనుకోవా
చిరాగ్గుంటే ఈ మరీ పెద్ద తరహా
సరే ఐతే విను ఎంతో చిన్న సలహా
పరారైతే సరి మరో వైపు మరి
|| అదిగో అలాగ || ||3||
.
.
(Contributed by Nagarjuna) |
Highlights
A great concept!
.
అదిగో అలాగ అదుపే తెలియక ఉరికే కదం ఇది
ఎదలో ఇలాగ నది హోరు లాగ పలికే పదం ఇది
.
దేవుడి లాగ ఉంటే ఫ్రీడం అంత సులువా
.
నీ పరువు నీదా పదవి నీదా ప్రజలదనుకోవా
.
సరే ఐతే విను ఎంతో చిన్న సలహా
పరారైతే సరి మరో వైపు మరి
………………………………………………………………………………………………. |
|
No Comments »