|
Context
Song Context:
ప్రతి పాటకొత్త మలుపే, ప్రతి పూట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే, తెలుసుకో!
|
Song Lyrics
పల్లవి: ||ఆమె||
అడుగేస్తే అందే దూరంలో.. హలో
అదిగో ఆ తారతీరంలో.. చలో
అటు చూడు ఎంత తళుకో
అది వచ్చి వాలేననుకో
కనుల ఇంత ఎంత వెలుగో చూసుకో
ఇది నేటి ఆదమరుపో, మరునాటి మేలుకొలుపో
వెనువెంట వెళ్ళి ఇపుడే తేల్చుకో
||అడుగేస్తే||
.
చరణం 1: ||ఆమె||
కొండంత భారం కూడా తేలిగ్గా అనిపిస్తుంది
గుండెల్లో సందేహలు ఏమి లేకుంటే
గండాలు సుడిగుండాలు ఉండే ఉంటాయి అనుకుంటే
సంద్రంలో సాగే నావ నాట్యం చేస్తునట్టు ఉంటుందే
ధీమగా పోతుంటే..ఏ మార్గం నిన్ను ఏనాడు ఆపదని
సరదాగా దూసుకెళ్ళిపో..కడదాక ఆగననుకో
కలగన్న రేపుని ఇపుడే కలుసుకో
.
చరణం 2: ||ఆమె||
ఉత్సాహాం పరుగులు తీస్తూ విశ్రాంతే కొత్తనుకుంటే
ఆయాసం కూడా ఎంతో హాయేలే
పోరాటం కూడ ఏదో ఆటలే కనపడుతుంటే
గాయాలు గట్రా చాలా మాములే అనిపిస్తాయి అంతే
నీ గమ్యం ఎదైనా..వెళ్ళాలే గాని, రమ్మంటే రాదు కదా
ప్రతి పాటకొత్త మలుపే, ప్రతి పూట ఆశ మెరుపే
ప్రతి చోట గెలుపు పిలుపే, తెలుసుకో!
||ఇది నేటి ఆదమరుపో||
.
.
(Contributed by Sai) |
Highlights
ఇది నేటి ఆదమరుపో, మరునాటి మేలుకొలుపో వెనువెంట వెళ్ళి ఇపుడే తేల్చుకో
……………………………………………………………………………………………….. |
2 Comments »